kodali Nani : కొడాలి నానికి టైం ఫిక్స్ అయిందా.. కూట‌మి ప్ర‌భుత్వం త‌ర్వాత టార్గెట్ ఇత‌నేనా ?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 7 August 2024, 9:00 pm
  •  kodali Nani : కొడాలి నానికి టైం ఫిక్స్ అయిందా.. కూట‌మి ప్ర‌భుత్వం త‌ర్వాత టార్గెట్ ఇత‌నేనా ?

kodali Nani : ప్ర‌స్తుతం ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నులు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. అటు ప్రజలలో ఇటు పార్టీ కార్యకర్తలలో భారీ అంచనాల మధ్య ఏర్పడిన కూటమి ప్రభుత్వం అంచనాలను ఏమేరకు నిలబెట్టుకుంది అన్న విషయానికి వస్తే ఐదేళ్లలో జగన్ సర్కార్ చెప్పలేని రాష్ట్ర రాజధాని ఏది అన్న ఒక ప్రశ్నకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నిముషాలలోనే ఎటువంటి ప్రకటన విడుదల చెయ్యకుండానే రాష్ట్ర ప్రజలందరికీ సమాధానం చెప్పగలిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో హ‌ద్దుదాటి ప్రవర్తించిన ప్రతి అధికారి మీద, నోరు జారీ ప్రవర్తించిన ప్రతి వైసీపీ నాయకుడి మీద చర్యలు తప్పవని ఊదరగొట్టిన బాబు, పవన్ లు అధికారం అందగానే ఒక్కసారిగా సైలెంట్ అయ్యిపోయారు.

kodali Nani కొడాలి నాని నెక్ట్స్ టార్గెట్..

బ‌య‌టకు వారు సైలెంట్‌గా క‌నిపిస్తున్నాడా కూడా లోలోపల వారు ప‌నుల‌ని చ‌క్క‌బెడుతున్న‌ట్టుగా తెలుస్తుంది. ఇప్ప‌టికే వ‌ల్ల‌భ‌నేని వంశీని అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగిన‌ట్టు తెలుస్తుండ‌గా, నెక్ట్స్ టార్గెట్ కొడాలి నాని అంటున్నారు. కొడాలినాని, వంశీలను పేర్ని నాని దాచాడంటూ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటి వరకూ ఓటమి ఎరుగని కొడాని నాని గుడివాడలో తొలిసారి ఓటమిపాలయ్యారు. గతంలో ఎన్నోమార్లు ఆయనను ఓడించాలన్న టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయనకు గుడివాడలో తిరుగులేదని భావించారు. 2024 ఎన్నికల్లోనూ తనను ఓడంచడం అసాధ్యమని ఆయన గట్టిగా నమ్మారు.. అలాంటిది వెనిగండ్ల రాము చేతిలో ఆయన దారుణంగా ఓటమిపాలయ్యారు. నిజానికి ఆయన ఊహించని ఓటమి. ఇది జీర్ణించుకోవడానికి ఆయన చాలా సమయం పట్టింది

kodali Nani : కొడాలి నానికి టైం ఫిక్స్ అయిందా.. కూట‌మి ప్ర‌భుత్వం త‌ర్వాత టార్గెట్ ఇత‌నేనా ?

kodali Nani : కొడాలి నానికి టైం ఫిక్స్ అయిందా.. కూట‌మి ప్ర‌భుత్వం త‌ర్వాత టార్గెట్ ఇత‌నేనా ?

కొడాలి నాని గుడివాడను వదిలేసి హైదరాబాద్ కే ఎక్కువ సమయం పరిమితమయ్యారు. తన ముఖ్య అనుచరులకు మినహా ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. తనను లక్ష్యంగా చేసుకుంటారని కొడాలి నానికి తెలియంది కాదు. అందుకే ఆయన ముందు జాగ్రత్తగా గుడివాడకు దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉంటూ అవసరమైతే తప్ప ఎవరికీ ఫోన్ లు కూడా చేయడం లేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు కొడాలి నానిపై వరస కేసులు నమోదవుతున్నట్లు తెలిసింది. ఆయనను లక్ష్యంగా చేసుకుని పోలీసులు పావులు కదుపుతున్నారు. పాత కేసులు తిరగదోడుతున్నారని తెలిసింది. త్వరలోనే కేసులు నమోదు చేసి కొడాలి నానిని అరెస్ట్ చేస్తారని గుడివాడలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది . కొడాలి నాని గుడివాడ రాకుండా హైదరాబాద్ లో ఉంటూ తనపై నమోదయిన కేసులపై న్యాయస్థానాలను ఆశ్రయించే పనిలో ఉన్నారని ఓ టాక్ న‌డుస్తుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "TTN SPECIAL ANALYSIS : బంకీపూర్ లో అంత ఈజీ గా ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచాడు ?"

  2. "Indiramma House: పేదలకు బంపర్ ఛాన్స్.. రూ.40 లక్షల ఫ్లాట్.. కేవలం రూ.6 లక్షలకే .. అర్హతలు, అప్లై విధానం, పూర్తి వివరాలివే..!"

  3. "PM-KISAN : రైతులకు భారీ శుభవార్త.. 23 విడతల్లో రూ.4.47 లక్షల కోట్లు జమ.. కొత్త లబ్ధిదారులపై కేంద్రం కీలక ప్రకటన"

  4. "Pradeep Rawat : టాలీవుడ్ స్టార్ విలన్ ప్రదీప్ రావత్.. కోట్ల ఆస్తి వెనుక అసలు కథ..!"

  5. "Karthika Deepam 2 Today Episode August 05 : సూరజ్‌ను దత్తత తీసుకుంటానన్న శ్రీధర్.. జ్యోత్స్నకు భారీ షాక్!"

  6. "Gold Rate Today : గుడ్‌న్యూస్‌.. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. ఆగస్టు 5 తాజా గోల్డ్ రేట్లు ఇవే!"

  7. "Sprouted Green Gram : కోడిగుడ్లు, పాలకంటే ఎక్కువ ప్రొటీన్.. ఈ సూపర్ ఫుడ్ తెలుసా?.. రోజూ గుప్పెడు చాలు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp