MLA Anil Kumar Yadav Mass Warning To Pawan Kalyan
MLA Anil Kumar : నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గురించి తెలుసు కదా. ఆయన మంత్రివర్గ విస్తరణ చేసేంత వరకు మంత్రిగా కొనసాగారు. మంత్రివర్గ విస్తరణలో ఆయన మంత్రి పదవి పోయింది. అనిల్ గురించి మాట్లాడితే చాలు.. ఆయన ఫైర్ బ్రాండ్ అంటారు. మీడియా ముందు మాట్లాడినా.. ఎక్కడ మాట్లాడినా ఆయన మాటలు మామూలుగా ఉండవు. రెచ్చిపోతారు. ముఖ్యంగా టీడీపీ నేతలపై, చంద్రబాబు, లోకేష్ పై ఆయన మామూలుగా విమర్శలు చేయరు. అనిల్, కొడాలి నాని, పేర్ని నాని.. ఈ ముగ్గురు వైసీపీలో పైర్ బ్రాండ్స్ అనే చెప్పుకోవాలి.
ఆయన మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడుతారు. తన నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు. గట్టిగానే మాట్లాడుతారు. తాజాగా ఆయన టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. టీడీపీ పార్టీ అరాచకాలపై ఆయన స్పందించారు. నెల్లూరులో అరాచకాలు చేసింది టీడీపీ హయాంలోనే. నెల్లూరులో దాడులు జరిగినా, మర్డర్స్ జరిగినా అవన్నీ టీడీపీ హయాంలోనే జరిగాయి అని అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు. వైజాగ్ లో కేంద్రంతో చెప్పి సీఎంను ఒక ఆటాడిస్తా అంటూ పవన్ వ్యాఖ్యానించారు. 12 ఏళ్లుగా ఏం లేని రోజుల్లోనే ఆరోజు సోనియా గాంధీని చూసి అందరూ గడగడలాడిపోతుందో ఆమెను ఆటాడించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.
MLA Anil Kumar Yadav Mass Warning To Pawan Kalyan
సోనియాగాంధీని గడగడలాడించే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పుట్టలేదు. ఒక చక్కటి చిరునవ్వుతో ఈ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి. ఆయన చాలామందికి ఉచ్చపోయించారు జగనన్న. నువ్వు కాదు కదా. నువ్వు ఆ బాబు, ఆ పులికేసి.. ఇంకెవ్వరు కట్టకట్టుకొని వచ్చినా కూడా జగన్ మోహన్ రెడ్డి వెంట్రుక కూడా టచ్ చేయలేదు. కేంద్రంతోనో.. ఇంకా ఎవరితోనే కట్టకట్టుకొని వచ్చినా జగన్ మోహన్ రెడ్డి గారిని ఏం పీకలేరు. చివరకు మీరే నడిరోడ్డు మీద నిలబడేది. కట్టకట్టుకొని మిమ్మల్ని ప్రజలు నడిరోడ్డు మీద నిలబెడతారు.. అంటూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అనిల్ కుమార్.
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
This website uses cookies.