Home » Andhra Pradesh » Mla Kethi Reddys Sensational Comments On Ys Vivekananda Reddys Murder Case
andhra pradesh

Kethi Reddy : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో వైయస్ అవినాష్ రెడ్డి పై ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: June 5, 2023, 3:00 pm
Advertisement

Kethi Reddy  : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు తెర పైకి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ పరిణామంతో ఏపీలో ప్రతిపక్షాలు వైసీపీని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలుమార్లు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావడం జరిగింది.

Advertisement

ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ కూడా మంజూరు చేయటం జరిగింది. ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారని ఓ వర్గం మీడియా తెగ ప్రచారం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ కేసు పై తాజాగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డికి ఇంకా అదే విధంగా భాస్కర రెడ్డికి ఏమీ కాదని చెప్పుకొచ్చారు. అవినాష్ రెడ్డి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అతను ఇలాంటివి చేయడు అని అందరికీ తెలుసు.

kethi reddys sensational comments on ys vivekananda reddys murder case

Advertisement

చిన్న విషయాలకే వాళ్ళు చాలా ఆలోచించే మనుషులు. అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను.. అని కేతిరెడ్డి తెలియజేశారు. ఇక కొన్ని మీడియా ఛానల్స్ పనిగట్టుకుని మసాలా జోడించి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కథనాలు ప్రసారం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ కేసులో చివరాఖరికి అవినాష్ రెడ్డి ఇంకా భాస్కర్ రెడ్డి నిర్దోషులుగా తేలుతారని… అసలు వాళ్ళ సమయం లేదని ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేయడం జరిగింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి