Home » Andhra Pradesh » Modi Planning To Arrest Ys Jagan
andhra pradesh

Ys Jagan : ఏ క్షణమైనా జగన్ అరస్ట్ ? బిగ్ స్కెచ్ తో సిద్ధమైన మోడీ..?

Authored By
Siddhu Manchikanti
The Telugu News | Updated on: April 10, 2026 12:56 pm
Advertisement

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒక రేంజ్‌లో హీటెక్కిపోయాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం చుట్టూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయం అంతా తిరుగుతోంది. జగన్ అరెస్ట్ అనేది ఇన్నాళ్లూ కేవలం ఒక ప్రచారంగానే ఉన్నప్పటికీ తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇది నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అర్థమవుతోంది. జగన్ వంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం తనకు పెద్ద కష్టమేమీ కాదని చంద్రబాబు నేరుగా హెచ్చరించడం వెనుక ఏదో పెద్ద వ్యూహమే దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యల్లా కనిపిస్తున్నా దీని వెనుక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక భారీ స్కెచ్‌తో సిద్ధంగా ఉందనే వార్తలు ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాబు స్పష్టం చేయడంతో ఇప్పుడు వైసీపీ క్యాడర్‌లో కలవరం మొదలైంది.

Advertisement

Ys Jagan : ఏ క్షణమైనా జగన్ అరస్ట్ ? బిగ్ స్కెచ్ తో సిద్ధమైన మోడీ..?

Ys Jagan : మోడీ వ్యూహం వెనుక అసలు కారణాలు

ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవినీతి విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని గత కొన్ని ఘటనలే నిరూపిస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా అదే పద్ధతిని అమలు చేయాలని మోడీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలు ఒకెత్తయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా జగన్ వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం కూడా సీరియస్‌గా ఉంది. లిక్కర్ స్కామ్ లేదా ఇతర ఆర్థిక నేరాల కేసుల్లో జగన్‌ను చుట్టేయడానికి రంగం సిద్ధమైనట్లు భోగట్టా. బాబు చేసిన కామెంట్స్ చూస్తుంటే కేవలం రాష్ట్ర స్థాయి విచారణలే కాకుండా కేంద్ర సంస్థలైన ఈడీ మరియు సీబీఐ కూడా ఎటాక్ చేసే అవకాశం మెండుగా కనిపిస్తోంది. జగన్ లాంటి నాయకులను ప్రోత్సహిస్తే రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదమని బాబు చెప్పడం అంటే అది కేంద్రం నుంచి వచ్చిన గ్రీన్ సిగ్నల్‌గా చాలా మంది భావిస్తున్నారు. అమరావతి రాజధానికి ప్రధాని మోడీ స్వయంగా శంకుస్థాపన చేశారని అటువంటి రాజధానిని అడ్డుకోవాలని చూసిన జగన్‌పై కేంద్రం ఆగ్రహంతో ఉంది.

Advertisement

Ys Jagan : ప్రజల రక్షణే ముఖ్యం

చంద్రబాబు తన ప్రసంగంలో మరో కీలక విషయాన్ని వెల్లడించారు. తాను ఎప్పుడూ చట్టప్రకారమే నడుచుకుంటానని ఏ తప్పూ చేయని తనను కూడా గతంలో అక్రమంగా జైలుకు పంపారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు జగన్ చేస్తున్న పనులు శాంతిభద్రతలకు సవాలుగా మారుతున్నాయని యాభై మందిని వెంటేసుకుని వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని మండిపడ్డారు. ఇలాంటి పనులకు పాల్పడితే ఏ క్షణమైనా కటకటాల వెనక్కి వెళ్లక తప్పదని ఆయన పరోక్షంగా జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రం బాగుండాలంటే ఇలాంటి అరాచక శక్తులను ప్రజలు మర్చిపోవాలని బాబు పిలుపునిచ్చారు. రాజధాని విషయంలో కూడా జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రెండు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. మోడీ అండతో అమరావతి నిర్మాణం పరుగులు పెడుతుంటే దానిని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని బాబు తేల్చి చెప్పారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జగన్ అరెస్ట్ అన్నది కేవలం సమయం కోసమే వేచి చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Siddhu Manchikanti

Author Bio Info : Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15+ years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి