Home » Andhra Pradesh » Nagababu Comments About Pawan Kalyan
andhra pradesh

Nagababu : నాగబాబు… నువ్ మాట్లాడేది లాజిక్ లెస్ గురూ.. మీ తమ్ముడు నడిచేది బాబు దారిలో..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: June 12, 2023, 10:00 am
Advertisement

Nagababu : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి తెలుసు కదా. ఆయనకు నాగబాబు అంటే చాలా ప్రేమ. నాగబాబుకు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ప్రేమ. నాగబాబుకు పవన్ కళ్యాణ్ తమ్ముడు. తన తమ్ముడు ఏపీని ఏదో చేస్తాడు అని అనుకుంటూ, ఊహించుకుంటూ ఉంటాడు నాగబాబు. అందుకే పవన్ కళ్యాణ్ ను ఎక్కడో ఊహించుకొని మురిసిపోతుంటాడు. అందుకే నేను సీఎం అభ్యర్థిని కాదు అంటూ పవన్ కళ్యాణ్ నెత్తినోరు మొత్తుకుంటున్నాడు. కానీ.. నాగబాబు మాత్రం కాదయ్యా.. నువ్వే మా రాజువి అన్నట్టుగా నువ్వే మా కాబోయే ముఖ్యమంత్రివి అంటూ జబ్బలు చరుచుకుంటున్నాడు. ఏపీకి భవిష్యత్తు ఉండాలంటే జనసేన ప్రభుత్వం రావాలంటూ నొక్కి మరీ చెబుతున్నాడు నాగబాబు.

Advertisement

పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్న ఒక ఫోటోను ఈనేపథ్యంలో నాగబాబు తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. నిజానికి అది వరుణ్ తేజ్ నిశ్చితార్థంలోని ఫోటో. ఆ ఫోటోను ట్వీట్ చేయడంతో ఇప్పుడు అది కాస్త వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ పై జనసేన ప్రత్యర్థులు కూడా సెటైర్లు విసిరేస్తున్నారు.ఇంతకీ నాగబాబు ఏం ట్వీట్ చేశాడో తెలుసా? అతడు పిల్లాడిగా ఉన్నప్పుడు సరైన మార్గంలో ఎలా నడవాలో నేర్పించాను.

nagababu comments about pawan kalyan

Advertisement

Nagababu : అసలు.. నాగబాబు ఏం ట్వీట్ చేశాడో తెలుసా?

కానీ.. ఇప్పుడు మేము ఇద్దరం పెద్దవాళ్లం అయ్యాం. పవన్ కళ్యాణ్ ఉన్నత స్థానాలను అధిరోహించారు. సరైన మార్గంలో నడిచే అవగాహన కూడా పెంపొందించుకున్నారు. అందుకే నేను ఇప్పుడు అతడి అడుగు జాడల్లో నడుస్తున్నా అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. దీంతో నువ్వు నీ తమ్ముడి వెంట నడుస్తున్నావు కావచ్చు నాగబాబు కానీ.. నీ తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం తన దత్త తండ్రి చంద్రబాబు వెంట నడుస్తున్నారు అంటూ లోకమంతా కోడై కూస్తోంది. దానికి విరుద్ధంగా మీరు ట్వీట్ చేస్తే ఎలా నాగబాబు అంటూ మనోడి ట్వీట్ ను ట్రోల్ చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి