Nagababu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది.ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా, తిరుగులేని వ్యూహాన్ని రచించిన పవన్ కల్యాణ్ గురించే అందరి నోట వస్తున్న మాట భేష్.. పవన్ కల్యాణ్ గురించి వెలువడుతున్న కథనాలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఎన్నికలకు ముందు నుంచి కూడా అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తానని పవన్ కల్యాణ్ శపథమే చేశాడు. తాను పట్టుబట్టి ఎడమొఖం.. పెడ మొఖం ఉన్న టీడీపీ, బీజేపీ పార్టీలను ఏకం చేశాడు. పొత్తుల్లో భాగంగా తలెత్తిన విభేదాలను పరిష్కరించుకోవడానికి తనకు కేటాయించిన సీట్లను వదులుకొని త్యాగానికి సిద్దపడ్డాడు. అందుకు కారణం వైఎస్ జగన్ పతనం చూడటమే.
ఎన్నికల తర్వాత తాను పోటీ చేసిన అన్ని స్థానాలు అంటే.. 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడం సరికొత్త చరిత్రగా మారింది. ఇప్పుడు 100 శాతం స్ట్రైక్ రేట్ అనేది జాతీయ మీడియాలో ఊతపదంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను పవన్ కల్యాణ్ గురించి తెగ వీడియోలు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా నాగబాబు ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చిన్న తనంలో అమ్మ మమ్మల్ని చదవండి అని బాగా విసిగించేది అట. అమ్మకి అన్నయ్య అంటే బాగా ఇష్టం. అమ్మకి ప్రతి పనిలో అన్నయ్య సాయం చేసేవాడు. నన్ను బాగా కొట్టేది అని చెప్పాడు. కళ్యాణ్ బాబు అంటే అందరికి స్పెషల్.. ఎందుకంటే కళ్యాణ్ బాబు ఆరోగ్యంగా పుట్టిన బేబీ కాదు. చాలా బలహీనంగా పుట్టాడు.
దీనితో కళ్యాణ్ బాబుని అమ్మ ఎంతో కేరింగ్ తో చూసుకుంది. నాన్నకి మాత్రం విపరీతమైన కోపం. ఎలాంటి కోపం వచ్చినా నాన్న ముందుగా పెద్ద కొడుకు అన్నయ్య కాబట్టి ఆయన్నే తిట్టేవారు అని నాగబాబు అన్నారు. పెద్దయ్యాక కూడా కొడుకుల కోసం అంజనాదేవి స్పెషల్ వంటకాలు చేస్తుందట కదా అని యాంకర్ ప్రశ్నించగా, కళ్యాణ్ బాబుకి పులావ్ బాగా ఇష్టం. తినాలని అనిపించినప్పుడు ఏదైనా వండి పంపొచ్చు కదమ్మా అని అడుగుతాడు. అమ్మ కూడా ఎప్పుడు అడుగుతాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది. స్పెషల్ గా పులావ్ వండి పంపిస్తుంది అని చెప్పుకొచ్చాడు.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.