Nandigam Suresh : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ వేడి విపరీతంగా రాజుకుంటూ వస్తుంది. ఈ వేడి ఎక్కడ దాకా విస్తరిస్తుందో…ఎంతమందిని దహించి వేస్తుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. మరి ముఖ్యంగా అధికార పార్టీ వై.ఎస్.ఆర్.సీ.పీ మరియు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ జనసేన కూటమి మధ్య మాటల యుద్ధంతో రాజకీయాలు రసవత్సరంగా మారుతున్నాయి. వాస్తవానికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అంటే చాలా హాట్ గా ఉంటాయి. ఇక ఇప్పుడు ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఆ రాజకీయ వేడి తీవ్రస్థాయికి చేరింది అని చెప్పాలి. అయితే ఈ రాజకీయ రణరంగంలో ఎలాగైనా అధికారం చేజికించుకోవాలనే తపనతో జనసేన మరియు టీడీపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీలు కలిసి తాడేపల్లిలో జెండా అనే భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఇక ఈ భారీ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయపరంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇక ఆ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా అధికార పార్టీ వైసీపీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తి రాజకీయాల్లో అసలు పనికిరారు అని చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే బహిరంగ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ తాజాగా బుధవారం రోజు పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన పార్టీల జెండా సభ నిర్వహించడం జరిగింది. అయితే ఈ భారీ బహిరంగ సభకు జనం రాకపోవడంతో వెలవెలబోయింది. ఇక ఆశించిన స్థాయిలో జనాలు రాకపోవడంతో అసంతృప్తి చెందిన అధినేతలు సభ వేదికపై తాము ఏం చేస్తాము అనే విషయాన్ని చెప్పడం మానేసి…సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. నారా చంద్రబాబు నాయుడు ఒక స్థాయిలో సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తూ ఉంటే…పవన్ కళ్యాణ్ మాత్రం శృతి మించి వ్యవహరించారని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అలాగే సీఎం జగన్ అంటే చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కి కూడా భయం పట్టుకుందని.. అందుకే నిన్న జరిగిన సభలో 200 సార్లు మా జగనన్న పేరు ప్రస్తావించారని , వైయస్ జగన్ పేరు తీసుకురాకుండా వారి సభ కూడా జరగడం లేదంటూ ఎంపీ నందిగాం సురేష్ చెప్పుకొచ్చారు. ఆయన స్వార్థం కోసం కన్నతండ్రిపై కూడా పవన్ కళ్యాణ్ నీచం గా మాట్లాడతారని …ఊసకాళ్ల తో ఉండే పవన్ కళ్యాణ్ తాడేపల్లిలో జగన్ ఇంటిని బద్దలు కొడతాడట. ఈ విధంగా ఉంటే పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరు. అదేవిధంగా ఒకప్పటి స్టార్ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనుక పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడని ఈ ఇంటర్వ్యూ వేదికగా నందిగాం సురేష్ తెలియజేశారు. మళ్లీ జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేస్తే పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఎలా తొక్కలో మాకు బాగా తెలుసు అని ,ఇక చంద్రబాబు నాయుడు అతి తెలివి ఉపయోగించి డిపాజిట్ కూడా దక్కని సీట్లను పవన్ కళ్యాణ్ కి ఇచ్చారని అందుకే జనసైనికులను ప్రశ్నించవద్దని అంటున్నారని ఈ సందర్భంగా నందిగామ సురేష్ పవన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.