Nara Bhuvaneshwari : మరి కొద్ది రోజులలో 2024కి గుడ్ బై చెప్పబోతున్నాం.ఈ క్రమంలో ఈ ఏడాది జరిగిన సంగతుల గురించి అందరు రివైండ్ చేసుకుంటున్నారు. 2024 కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఎన్నికల ఏడాది కావడంతో సంచలనాత్మక పరిణామాలు ఉంటాయని అందరూ ఊహించారు. కానీ ఆ పరిణామాలు ఎటు వైపు ఉంటాయో ఊహించలేకపోయారు. హోరాహోరీ పోరాటం ఉంటుందని అంచనా వేశారు. పోరాటం అలాగే ఉంది. కానీ ఫలితాలు మాత్రం ఏకపక్షంగా వచ్చాయి. 2024 ఏపీ.. భవిష్యత్ కూడా చర్చించుకునే విధంగా మార్పులు తీసుకు వచ్చింది. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు రాజమండ్రి జైలు బయటే పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన చేశారు…
కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అన్న సస్పెన్స్ మాత్రం సుదీర్ఘంగా కొనసాగింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పొత్తులు ఖరారయ్యాయి. అప్పటికి టీడీపీ, జనసేన తొలి జాబితా కూడా ప్రకటించారు. ఈ పొత్తులు ఓ గేమ్ ఛేంజర్ గా మారాయి. ఎన్డీఏ కూటమిగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే మరో వైపు జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఒంటరి పోరుకు సిద్దమయ్యారు. కమ్యూనిస్టుల్ని కూడా దగ్గరకు తీసుకోలేదు. దాంతో దారుణంగా ఓటమి చెందాల్సి వచ్చింది. అయితే ఏపీ రాజకీయాలలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా హైలైట్ అయ్యారు.
చంద్రబాబు సతీమణి తన భర్తకు తోడుగా జనంలోకి వచ్చారు. నిజానికి చూస్తే ఆమె 2023 సెప్టెంబర్ లో బాబుని అరెస్ట్ చేసినపుడే ప్రజలలోకి వచ్చారు. బాబు అదే ఏడాది రిలీజ్ అయ్యారు. ఎలక్షన్స్ సమయంలో కూడా భువనేశ్వరి చాలా ప్రచారాలు చేశారు. ఆమె మహిళలతో నిర్వహించిన సభలు ఆమె జనాలతో మమేకం అయిన తీరు ఆమె చేసిన ప్రకటనలు టీడీపీ గురించి చంద్రబాబు గురించి ఆమె చేసిన ప్రచారం అన్నీ కూడా టీడీపీ కూటమిని విజయతీరాలకు చేర్చడంతో ఎంతో ముఖ్య పాత్ర పోషించాయి.ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా ఆమె తన వంతుగా జనంలోకి వస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆమె తరచూ పర్యటిస్తున్నారు. అక్కడ ప్రజల బాగోగులు చూస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను కూడా చూస్తున్నారు. ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఒపీనియన్ పెరిగేలా చూస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ఆమె రాజకీయాల్లోకి అయితే అడుగు పెట్టేది లేదనే అంటున్నారు. అయితే ఆమె ప్రభావం మాత్రం 2024లో ఏపీ రాజకీయాల మీద బాగానే పడింది
Ap Intermediate 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న…
Zodiac Signs : రానున్న సంవత్సరంలో ముఖ్యంగా జనవరిలో గ్రహాల రవాణా అన్ని రాశుల వారి జీవితాలు పైన ప్రభావాన్ని…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ లుక్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చిరు కూల్ లుక్ తో…
Krithi Shetty : ఉప్పెన భామ కృతి శెట్టి సినిమాల వేగం తగ్గింది. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగానే…
Allu Arjun : గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. పుష్ప2లో…
Mohan Babu : తన ఫ్యామిలీతో జరుగుతున్న గొడవల్లో భాగంగా రిపోర్టర్ చెవికి గాయాన్ని చేశారు హీరో మంచు మోహన్…
Jr NTR : ఎన్ టీ ఆర్ ఫ్యాన్ కౌశిక్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ టైం లో…
Health Benefits : 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మీలో ఆ స్టామినా మెయింటెనెన్స్ చేయడానికి కొన్ని ఆహారాలు…
This website uses cookies.