Nara Bhuvaneshwari 2024 : ఈ ఏడాది తెలుగు రాజ‌కీయాల‌లో నారా భువనేశ్వరి హైలైట్‌.. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nara Bhuvaneshwari 2024 : ఈ ఏడాది తెలుగు రాజ‌కీయాల‌లో నారా భువనేశ్వరి హైలైట్‌.. !

 Authored By ramu | The Telugu News | Updated on :25 December 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Nara Bhuvaneshwari 2024 : ఈ ఏడాది తెలుగు రాజ‌కీయాల‌లో ఆమెనే హైలైట్‌.. !

Nara Bhuvaneshwari : మ‌రి కొద్ది రోజుల‌లో 2024కి గుడ్ బై చెప్ప‌బోతున్నాం.ఈ క్ర‌మంలో ఈ ఏడాది జ‌రిగిన సంగ‌తుల గురించి అంద‌రు రివైండ్ చేసుకుంటున్నారు. 2024 కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఎన్నికల ఏడాది కావడంతో సంచలనాత్మక పరిణామాలు ఉంటాయని అందరూ ఊహించారు. కానీ ఆ పరిణామాలు ఎటు వైపు ఉంటాయో ఊహించలేకపోయారు. హోరాహోరీ పోరాటం ఉంటుందని అంచనా వేశారు. పోరాటం అలాగే ఉంది. కానీ ఫలితాలు మాత్రం ఏకపక్షంగా వచ్చాయి. 2024 ఏపీ.. భవిష్యత్ కూడా చర్చించుకునే విధంగా మార్పులు తీసుకు వచ్చింది. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు రాజమండ్రి జైలు బయటే పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన చేశారు…

Nara Bhuvaneshwari 2024 ఈ ఏడాది తెలుగు రాజ‌కీయాల‌లో నారా భువనేశ్వరి హైలైట్‌

Nara Bhuvaneshwari 2024 : ఈ ఏడాది తెలుగు రాజ‌కీయాల‌లో నారా భువనేశ్వరి హైలైట్‌.. !

Nara Bhuvaneshwari త‌న‌దైన మార్క్..

కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అన్న సస్పెన్స్ మాత్రం సుదీర్ఘంగా కొనసాగింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పొత్తులు ఖరారయ్యాయి. అప్పటికి టీడీపీ, జనసేన తొలి జాబితా కూడా ప్రకటించారు. ఈ పొత్తులు ఓ గేమ్ ఛేంజర్ గా మారాయి. ఎన్డీఏ కూటమిగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే మరో వైపు జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఒంటరి పోరుకు సిద్దమయ్యారు. కమ్యూనిస్టుల్ని కూడా దగ్గరకు తీసుకోలేదు. దాంతో దారుణంగా ఓట‌మి చెందాల్సి వ‌చ్చింది. అయితే ఏపీ రాజ‌కీయాల‌లో సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి కూడా హైలైట్ అయ్యారు.

చంద్రబాబు సతీమణి తన భర్తకు తోడుగా జనంలోకి వచ్చారు. నిజానికి చూస్తే ఆమె 2023 సెప్టెంబర్ లో బాబుని అరెస్ట్ చేసినపుడే ప్రజలలోకి వచ్చారు. బాబు అదే ఏడాది రిలీజ్ అయ్యారు. ఎల‌క్ష‌న్స్ స‌మ‌యంలో కూడా భువ‌నేశ్వ‌రి చాలా ప్ర‌చారాలు చేశారు. ఆమె మహిళలతో నిర్వహించిన సభలు ఆమె జనాలతో మమేకం అయిన తీరు ఆమె చేసిన ప్రకటనలు టీడీపీ గురించి చంద్రబాబు గురించి ఆమె చేసిన ప్రచారం అన్నీ కూడా టీడీపీ కూటమిని విజయతీరాలకు చేర్చడంతో ఎంతో ముఖ్య పాత్ర పోషించాయి.ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా ఆమె తన వంతుగా జనంలోకి వస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆమె తరచూ పర్యటిస్తున్నారు. అక్కడ ప్రజల బాగోగులు చూస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను కూడా చూస్తున్నారు. ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఒపీనియన్ పెరిగేలా చూస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ఆమె రాజకీయాల్లోకి అయితే అడుగు పెట్టేది లేదనే అంటున్నారు. అయితే ఆమె ప్రభావం మాత్రం 2024లో ఏపీ రాజకీయాల మీద బాగానే పడింది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది