Pawan Kalyn : పవన్ కళ్యాణ్ జిమ్మిక్కులు.. ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నవైసీపీ
Pawan Kalyn : ఎన్నికల ఫీవర్‌తో ఆంధ్రప్రదేశ్ ఊగిపోతోంది. ఏ ఇద్దరు కలిసినా ఎన్నికల గురించే ముచ్చటిస్తున్నారు. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. అలాంటి వాటిలో ఒకటి కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఆ నియోజక వర్గంపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ అనే పేరుతో ఉన్న ముగ్గురు అభ్యర్థులు పోటీచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న అభ్యర్థులను వైసీపీ పోటీ పెట్టిందంటూ కొన్ని పోస్ట్‌లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. కోనేటి పవన్ కళ్యాణ్, కనుమూరి పవన్ కళ్యాణ్ పేరుతో మరో ఇద్దరు పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పిఠాపురంలో జనసేన అధినేత గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన గెలుపు కోసం సెలబ్రెటీలు, కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. తాజాగా వైసీపీ వారు జనసేన పై పలు విమర్శలు చేశారు. పవన్ పిఠాపురంలో ఓడిపోతారనే భయంతో ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేత వర్మని నమ్మలేక.. అలా అని వదులుకోలేక గత కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ పడరాని పాట్లు పడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రచారంలో దూసుకెళ్తున్న వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా గ్రాఫ్ రోజురోజుకీ పెరిగిపోతుండటంతో పవన్‌కి పెరిగిన ఓటమి భయం పట్టుకుందనన్నారు. అందుకే పవన్ కల్యాణ్ పిఠాపురంలో గీత పేరు ఉన్న మహిళతో నామినేషన్ వేయించారని ఆరోపించారు. ఇద్దరి అఫిడవిట్‌ను ఒకే లాయర్ ఫిల్ చేయడంతో కుట్ర బయటపడినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Pawan Kalyn : పవన్ కళ్యాణ్ జిమ్మిక్కులు.. ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నవైసీపీ
రెండు అవిఫడవిట్లకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా షేర్ చేశారు.. రెండు అఫిడవిట్లను వెంకట రమణ రావు తయారు చేసినట్లు ఉన్నాయి.మరోవైపు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో వైసీపీపై విరుచుకుపడుతున్నారు. అమలపురం పీకే ఫ్యాన్స్ అనే ట్విట్టర్ అకౌంట్ లో నామినేషన్ వెనక్కి తీసుకున్న వంగా గీత అంటూ పోస్ట్ చేశారు. వంగా గీతా జనసేన తరఫున పోటీ చేస్తారని కూడా రాసుకొచ్చారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి మొత్తం 23 మంది అభ్యర్ధులు నామినేషన్ వేశారు. 23 మంది కలిసి 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నామినేషన్ల పరిశీలనలో భాగంగా రెండు నామినేషన్లను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించింది.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.