#image_title
Rayapati Aruna : జనసేనలో అందరికీ తెలిసిన నాయకుల్లో ముఖ్యంగా మహిళ నేతల్లో రాయపాటి అరుణ ఒకరు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆమె పార్టీ గొంతును బలంగా వినిపిస్తుంటారు. టీవీ డిబేట్ లలో పార్టీ తరపున మాట్లాడడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్ గా ఉంటారు. అలాంటి రాయపాటి అరుణ తాజాగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి కొన్ని రోజుల్లో శాసనసభ ఎన్నికలు రానున్నాయి. వైసీపీ పార్టీ పదవీకాలం ముగియనుంది. అయినా ఇప్పటికీ వైసీపీ నాయకులు ఏం చేశారు ఏం సాధించామో చెప్పకుండా నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.
ప్రజల డబ్బులతో ‘ సిద్ధం ‘ అని బహిరంగ సభలు పెట్టి ప్రచారం చేసుకుంటున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కౌంటర్ గా జనసేన నాయకులు జనసేన జెండాలు పెట్టారు. దానికి రీల్స్ స్టార్ అయిన ఎంపీ భరత్ రామ్ వేసిన కౌంటర్ సిగ్గుచేటుగా ఉందని అరుణ అన్నారు. పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం గురించి ఎంపీ భరత్ మాట్లాడడం హాస్యంగా ఉందని అన్నారు. వైసీపీ పార్టీకి జరిగిన డ్యామేజ్ కి వాళ్లకి ఎప్పుడో సిగ్గు రావాలి. వచ్చే ఎన్నికల్లో శాసనసభ్యుడిగా పోటీ చేయబోతున్న ఎంపి భరత్ జనాల వద్దకు వెళ్లి తనకు ఓటు వేయమని ఎలా అడుగుతాడు. పవన్ కళ్యాణ్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. అయినా వాళ్లు విడిపోయి వాళ్ల జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు.
కానీ ఎంపీ భరత్ ఒక పెళ్లి చేసుకొని తన భార్యని టార్చర్ పెడుతూ గృహం హింస కేసులు పెట్టించుకుంటూ సిగ్గు లేకుండా రీల్స్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. నువ్వేమైనా పెద్ద పోటుగాడివి అనుకుంటున్నావా.. నీ భార్య నీ మీద గృహహింస కేసులు పెడుతున్నా సిగ్గు లేకుండా తిరుగుతున్నావు. ఏ మొహం పెట్టుకొని నియోజకవర్గంలో ఓట్లు అడుగుతాడు అని రాయపాటి అరుణ ఎంపీ భరత్ పై విరుచుకుపడ్డారు. ఊర్లలో రోడ్లు లేవు, విద్యాలయాలు లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ సరిగా వేయలేదు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. మీ బ్రతుకులకు ఐదేళ్ల కాలం సరిపోయింది. ఎమ్మెల్యేగా ఎంపీగా తమ నియోజకవర్గాలకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఒకరి వైవాహిక జీవితం గురించి మాట్లాడే హక్కు లేదని రాయపాటి అరుణ ఎంపీ భరత్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.