
SEC Nimmagadda Ramesh One more shock to YS Jaganmohan reddy
Nimmagadda Ramesh : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు అంతా సజావుగా సాగాలంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వంకు ఆదేశించింది. రాజ్యాంగబద్దంగా ఎస్‌ఈసీకి ప్రభుత్వం సహకరించాల్సిందే అంటూ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గి ఎన్నికలకు సహకరించేందుకు సిద్దం అయ్యింది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ పై చేయి సాధించినట్లు అయ్యింది. సీఎం వైఎస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకున్న అధికారులను ఎస్‌ఈసీ తొలగిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఎన్నికల నిర్వహణ కోసం నిమ్మగడ్డ రమేష్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యంగా ఎస్‌ఈసీ కార్యదర్శి వాణి మోహన్ ను ప్రభుత్వంకు సరెండర్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఆ పదవికి కొత్త వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వంకు మూడు సార్లు లేఖ రాయడం జరిగింది. ప్రభుత్వం నుండి స్పందన లేదు. దాంతో నిమ్మగడ్డ స్వయంగం రంగంలోకి దిగి ఎన్నికల అధికారిగా రవి చంద్రన్ ను నియమిస్తున్నట్లుగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
SEC Nimmagadda Ramesh One more shock to YS Jaganmohan reddy
వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన విషయమై పరిశీలించేందుకు రవిచంద్రన్ ను ఆరోగ్య శాఖలో ఒక పోస్ట్ ను క్రియేట్ చేసి మరీ ఆయనకు ఇచ్చారు. కాని నిమ్మగడ్డ ఆయన్ను ఎన్నికల అధికారిగా తీసుకోవాలనుకోవడం కాస్త చర్చనీయాంశం అయ్యింది. ఖచ్చితంగా రవిచంద్రన్ లాంటి ఐఏఎస్ వల్ల ఎన్నికల పక్రియ కాస్త జఠిలం అవుతుంది. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కొరకరాని కొయ్యగా తయారు అయ్యాడు. అలాంటిది ఆయనకు మరొకరు జత అవ్వడం వల్ల మరింతగా నష్టం తప్పదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు వైకాపా నాయకులు ఆందోళన చెందుతున్నారు.
సీఎం వైఎస్ జగన్ అన్ని విధాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో ప్రధానంగా ఏకగ్రీవాలు. భయపెట్టి బెదిరించి బుజ్జగించి డబ్బు ఆశ చూపించి ఎక్కువ స్థానాల్లో ఏకగ్రీవాలు చేయాలని భావిస్తున్నారు. ఆ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ ఎంపిక చేసిన అధికారులు ఖచ్చితంగా ఏకగ్రీవాలను అడ్డుకోవడం ఖాయం అంటున్నారు. జెన్యూన్ గా ఏకగ్రీవాలు జరిగితే పర్వాలేదు. కాని బలవంతపు ఏకగ్రీవాల వల్ల ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పులిలా పంజా విసిరి జగన్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఈ దెబ్బ నుండి జగన్ ఎలా తేరుకుంటాడో చూడాలి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.