Home » Andhra Pradesh » Secret Behind Ys Jagans Defeat In 2024 Has Been Leak
andhra pradesh

YS Jagan : 2024 లో జగన్ ఓటమి వెనక రహస్యం లీక్ .. పోలింగ్ పూర్తయిన రాత్రి ఏం జరిగింది ..?

Authored By
Siddhu Manchikanti
The Telugu News | Published on: February 17, 2026, 2:00 pm
Advertisement

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి చాలా రోజులు అవుతున్నా ఆ ఓటింగ్ జరిగిన తీరు మీద మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా ప్రముఖ వెబ్సైట్ ది వైర్ లో పరకల ప్రభాకర్ రాసిన ఒక కథనం ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడేలా చేస్తోంది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటా ప్రకారమే ఆయన కొన్ని విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. సాధారణంగా ఎన్నికల రోజు సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత క్యూ లైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఇస్తారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో ఐదు గంటల తర్వాత ఏకంగా పన్నెండున్నర శాతం ఓటింగ్ అదనంగా నమోదు అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఐదు గంటలకే గేట్లు వేసేసినా కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత కూడా వేల సంఖ్యలో బూతుల్లో ఓట్లు పడటం వెనుక ఏదో మాయాజాలం జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి.

Advertisement

YS Jagan : 2024 లో జగన్ ఓటమి వెనక రహస్యం లీక్ .. పోలింగ్ పూర్తయిన రాత్రి ఏం జరిగింది ..?

YS Jagan ఏపీ ఎన్నికల ఓటింగ్ సరళిపై :

పరకల ప్రభాకర్ అందించిన గణాంకాల ప్రకారం రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తెల్లవారుజామున రెండు గంటల మధ్యలో దాదాపు పదిహేడు లక్షల మంది ఓటర్లు ఓటు వేశారట. అంటే ఒక్కో నిమిషానికి సగటున నలుగురు ఓటు వేసినట్టు లెక్క వస్తోంది. ఒక మనిషి ఓటు వేయాలంటే అసెంబ్లీ మరియు పార్లమెంట్ రెండింటికీ కలిపి వివిప్యాడ్ స్లిప్పులు రావడానికే పద్నాలుగు సెకన్ల సమయం పడుతుంది. మళ్ళీ ఆ ఓటర్ రిజిస్టర్ లో సంతకం చేసి సిరా గుర్తు వేయించుకుని కంపార్ట్మెంట్ లోకి వెళ్లి ఓటు వేయడానికి కచ్చితంగా అర నిమిషం పైన పడుతుంది. కానీ ప్రతి పదిహేను సెకన్లకు ఒక ఓటు ఎలా పడిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇది మనుషులు వేసిన ఓట్లా లేక సిస్టం లో సాఫ్ట్వేర్ ద్వారా సృష్టించిన అదృశ్య ఓట్లా అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. కనీసం ఆ సమయంలో ఓటర్లు క్యూ లైన్లలో ఉన్నట్టు ఎక్కడా మీడియాలో కూడా వార్తలు రాలేదు.

Advertisement

ఎన్నికల నిబంధనల ప్రకారం ఫార్మ్ ఇరవై మీద రిటర్నింగ్ ఆఫీసర్ తో పాటు అబ్జర్వర్ సంతకం కూడా ఉండాలి. కానీ పరకల ప్రభాకర్ పరిశీలించిన చాలా పత్రాల మీద అబ్జర్వర్ సంతకాలే లేవని తెలుస్తోంది. వైఎస్ఆర్సిపి నాయకులు ఐదు గంటల తర్వాత జరిగిన ఓటింగ్ వివరాలు మరియు వెబ్ క్యాస్టింగ్ వీడియోలు అడిగినా కూడా ఎన్నికల కమిషన్ వాటిని ఇవ్వకపోవడం మరియు చాలా డేటాను అప్పట్లోనే డిలీట్ చేయడం చూస్తుంటే ఏదో పెద్ద కుట్ర జరిగిందని అనిపిస్తోంది. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందని ఆయన చాలా ధీమాగా ఉన్నారు. కానీ ఈ ఓటింగ్ లెక్కలు చూస్తుంటే ప్రజలు ఇచ్చిన తీర్పు కంటే కూడా టెక్నాలజీ ద్వారా జరిగిన మార్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా అంత వేగంగా ఓట్లు పడటం సాధ్యం కానప్పుడు ఈ ఎన్నికల ఫలితాలను ఏమని పిలవాలో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా తలలు పట్టుకుంటున్నారు. మున్ముందు ఈ విషయంలో మరిన్ని సంచలన నిజాలు బయటకు వస్తాయని అంతా ఎదురుచూస్తున్నారు.

 

Siddhu Manchikanti

Author Bio Info : Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15+ years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి