Home » Andhra Pradesh » See How Kodali Nani Is Doing After Heart Surgery
andhra pradesh

Kodali Nani : హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి బయటికి వచ్చిన కొడాలి నాని.. ఎలా ఉన్నాడో చూడండి..!

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Published on: May 24, 2025, 6:15 pm
Advertisement

Kodali Nani : వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి ప్రజల్లో కనిపించారు. హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో నిన్న జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరుకావడం తో ఆ తాలూకా ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. హార్ట్ ఆపరేషన్ అనంతరం నాని విశ్రాంతి తీసుకుంటూ వచ్చారు. అలాగే మెరుగైన చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్తారని ప్రచారం కూడా జరిగింది. ఇక ఇప్పుడు పెళ్లి వేడుకలో బాగానే ఉన్నట్లు కనిపించేసరికి అంత నాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

Advertisement

Kodali Nani : హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి బయటికి వచ్చిన కొడాలి నాని.. ఎలా ఉన్నాడో చూడండి..!

Kodali Nani హార్ట్ సర్జరీ తర్వాత కొడాలి నాని ఎలా మారిపోయాడో తెలుసా..?

ఇదే సమయంలో కృష్ణా జిల్లా ఎస్పీ కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. నాని అమెరికా వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో నాని హైదరాబాద్‌లో కనిపించడం, అది కూడా కొద్ది గంటల వ్యవధిలోనే ఫోటోలు బయటకు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నాని హాజరైన వివాహ వేడుక ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతూ, ఆయన్ని చుట్టుముట్టిన వివాదాలను మరోసారి ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాయి.

Advertisement

ఇక నానిపై వివిధ కేసులు నమోదైన నేపథ్యంలో త్వరలోనే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే నానిపై విచారణలు కొనసాగుతున్నాయని, అధికార యంత్రాంగం నిశితంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ఈ పరిణామాలు వైసీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి