Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రే ట్రెండింగ్. ఎక్కడ చూసినా ఆ యాత్ర గురించే ట్రెండింగ్ నడుస్తోంది. దానికి కారణం.. వారాహి యాత్రలో పలు చోట్ల బహిరంగ సభలు పెట్టి మరీ ప్రసంగిస్తున్న పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ పై వ్యక్తిగతంగా మాట్లాడుతూ రెచ్చిపోతున్నారు. వైసీపీ పార్టీపై కూడా తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై కూడా పవన్ రెచ్చిపోతుండటంతో.. ఆయనకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబును సీఎం చేస్తామని చెప్పినా కూడా కాపులు ఎవ్వరూ ఆయన వెంట వెళ్లడం లేదు. అందుకే.. ఇక తప్పేది లేక తానే సీఎం అవుతానంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకున్నరు పవన్ కళ్యాణ్. అంటే.. పవన్ కళ్యాణ్ అంతిమంగా పనిచేసేది ఎవరి కోసమో అర్థం అవుతోంది కదా అంటూ విమర్శల వర్షం కురిపించారు.
అది వారాహి యాత్ర కాదు. నారాహి అబద్ధాల యాత్ర. అబద్ధాలు చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ వల్ల ఎవరికి ప్రమాదమో అందరికీ తెలుసు. అసలు.. పవన్ కళ్యాణ్ వల్ల రాజకీయంగా వైసీపీకి ఎలాంటి ప్రమాదం లేదని పేర్ని నాని చెప్పుకొచ్చారు. కాపులు లేకపోతే జనసేన లేదని.. తాను లేనని గప్పాలు పలుకుతున్న పవన్ కళ్యాణ్.. కాపుల్లో తనపై సానుభూతి తగ్గింది అని అనుకున్నప్పుడల్లా ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. సొల్లు కబుర్లు చెబుతూ టైమ్ పాస్ చేస్తుంటారు. తనకు నిజంగానే ప్రాణహాని ఉంటే.. అది చెప్పాల్సింది బహిరంగ సభలో కాదు.. పోలీసులకు అంటూ పేర్ని నాని మండిపడ్డారు. తన చుట్టూ పవన్ కళ్యాణ్ సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాడు. కనీసం తన అభిమానులను కూడా రానివ్వడం లేదు.
అభిమానులను పక్కన పెడితే.. తన పార్టీలో పనిచేసే నాయకులను కూడా తన దగ్గరికి, తన పక్కన నిలబడటానికి కూడా పవన్ కళ్యాణ్ ఇష్టపడటం లేదు. పవన్ కు అసలు ప్రాణహాని ఉంటే అది చంద్రబాబుతోనే. ఎందుకంటే.. వైఎస్ జగన్ కు బురద అంటించాలని.. పవన్ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి అయినా వెనుకాడరు. అందుకే.. చంద్రబాబుతోనే పవన్ జాగ్రత్తగా ఉంటే బెటర్. చంద్రబాబు చేసిన పాపాలకు లెక్క ఉందా? ఆయన చేసిన పాపాలకు ఎన్నిసార్లు గుడ్డలు ఊడదీసి కొట్టాలి.. అంటూ పేర్ని నాని.. పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. మరి.. వీటికి పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం ఉందా?
Mustard Greens : మనకు అందుబాటులో ఉండే ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆకు కూరలో…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే గ్రహణాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది.…
Govt Jobs : హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL వివిధ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం జనవరి 15…
Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. టెలిగ్రాము కర్మ ఫలాలను బట్టి,…
Gottipati Ravi Kumar : ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ Ysrcp చేసే విష…
Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న తన ప్రమాణ స్వీకారం అమెరికా కాపిటల్…
Donald Trump : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీ…
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ మూవీ గేం ఛేంజర్ Game Changer దగ్గర బోల్తా…
This website uses cookies.