Ramayana Movie : సాయి పల్లవి కంటే ముందు సీతగా ఆ హీరోయిన్నీ ఎందుకు త‌ప్పించారంటే..?

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: November 7, 2026, 7:30 am
  •  Ramayana Movie : భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన భారీ చిత్రం ‘రామాయణ’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 5న…

Ramayana Movie : భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన భారీ చిత్రం ‘రామాయణ’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజే భారీ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. మొదటి రోజే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా వెల్లడించింది. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, స్టార్ నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి సుమారు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. గురువారం (నవంబర్ 5) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచే మంచి స్పందన లభించినట్లు ప్రచారం జరుగుతోంది. నటీనటుల అభినయం, దర్శకుడు నితీశ్ తివారీ టేకింగ్‌తో పాటు హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రామాయణ ఇతిహాసాన్ని నేటి ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి కలిగించేలా తెరపై ఆవిష్కరించారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Ramayana Movie : సాయి పల్లవి కంటే ముందు సీతగా ఆ హీరోయిన్నీ ఎందుకు త‌ప్పించారంటే..?

Ramayana Movie : సాయి పల్లవి కంటే ముందు సీతగా ఆ హీరోయిన్నీ ఎందుకు త‌ప్పించారంటే..?

నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యష్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, డీఎన్ఈజీ సంస్థలు ఈ భారీ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాయి. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు సన్నీ డియోల్, శోభన, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, హరీశ్ ఉత్తమన్, ఫైసల్ మాలిక్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, ముకేశ్ తివారి, అనుపమ్ ఖేర్, సౌరబ్ సచ్‌దేవ్, రవి దూబే, ఆదినాథ్ కొఠారే, నితీశ్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో ఒదిగిపోయారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇక సీతమ్మ పాత్రలో సాయి పల్లవి తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారని చర్చ జరుగుతోంది. అయితే సాయి పల్లవికి ఈ అవకాశం దక్కకముందు సీత పాత్ర కోసం పలువురు బాలీవుడ్ హీరోయిన్లను సంప్రదించారనే వార్తలు గతంలో వినిపించాయి. వారిలో ప్రముఖ నటి కరీనా కపూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. తాజాగా ఈ విషయంపై కరీనా స్పందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Ramayana Movie సీత పాత్రను కరీనా కపూర్ తిరస్కరించిందా? పారితోషికంపై వచ్చిన వార్తల్లో నిజమెంత?

గతంలో రామాయణ సినిమాలో సీత పాత్ర కోసం ముందుగా కరీనా కపూర్‌ను సంప్రదించారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆమె భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో చిత్ర బృందం ఆమెను పక్కనపెట్టి సాయి పల్లవిని ఎంపిక చేసుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ముఖ్యంగా సాధారణ పారితోషికం కంటే రెట్టింపు మొత్తాన్ని కరీనా అడిగారనే వాదనలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు నిజమా కాదా అనే విషయంపై అభిమానుల్లో చాలాకాలంగా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ప్రచారంపై కరీనా కపూర్ స్వయంగా స్పష్టత ఇచ్చింది. రామాయణ సినిమాలో సీత పాత్ర పోషించేందుకు తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని ఆమె వెల్లడించింది. అంతేకాదు, ఈ సినిమా విషయంలో తనతో చిత్ర బృందం ఎలాంటి చర్చలు కూడా జరపలేదని స్పష్టం చేసింది.దీంతో సీత పాత్ర కోసం కరీనాను సంప్రదించారని, ఆమె ఎక్కువ పారితోషికం అడగడంతోనే అవకాశం కోల్పోయారని వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. అసలు ఆ పాత్ర కోసం తనను ఎవరూ సంప్రదించలేదని కరీనా చెప్పడంతో ఇన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న రెమ్యునరేషన్ వివాదానికి తెరపడినట్లయింది. కరీనా తాజా వివరణతో ఈ అంశం మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read :  Jio Plan : గుడ్‌న్యూస్‌.. జియోలో రూ.123కే రీఛార్జ్ ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ, 14GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్..!

సీత పాత్ర కోసం శ్రీనిధి శెట్టి ఆడిషన్స్.. ఎంపిక చేయలేదని వెల్లడి!

మరోవైపు కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి పేరు కూడా సీత పాత్ర ఎంపిక విషయంలో వినిపించింది. సాయి పల్లవి కంటే ముందు ఆమె కూడా ఈ పాత్ర కోసం ఆడిషన్స్‌లో పాల్గొన్నట్లు వెల్లడైంది. అయితే దర్శక నిర్మాతలు చివరకు శ్రీనిధి శెట్టిని ఎంపిక చేయలేదు.ఈ విషయాన్ని శ్రీనిధి శెట్టినే స్వయంగా వెల్లడించింది. దీంతో సీత పాత్ర కోసం పలువురు నటీమణులు ప్రయత్నించారనే విషయం మరోసారి చర్చకు వచ్చింది. అయితే చివరకు దర్శకుడు నితీశ్ తివారీ బృందం సాయి పల్లవిని ఎంపిక చేసింది.ఇప్పుడు రామాయణ సినిమా విడుదల కావడం, తొలి రోజు భారీ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించడంతో సీత పాత్ర ఎంపికకు సంబంధించిన పాత వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కరీనా కపూర్ రెమ్యునరేషన్ గురించి వచ్చిన ప్రచారాన్ని ఆమె ఖండించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సాయి పల్లవి సీత పాత్రలో ఎలా మెప్పించారనే చర్చతో పాటు, ఈ పాత్ర కోసం గతంలో ఎవరెవరు ప్రయత్నించారనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. Ramayana Movie, Kareena Kapoor, Sai Pallavi, Srinidhi Shetty, Ramayana Sita Role

Ramalingaiah Tandu

Author Bio Info : Ramalingaiah Tandu is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Ramayana Movie : సాయి పల్లవి కంటే ముందు సీతగా ఆ హీరోయిన్నీ ఎందుకు త‌ప్పించారంటే..?"

  2. "Diwali 2026 : దీపావళి రాత్రి ఈ పని చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందట!"

  3. "Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించ‌ని భారీ ట్విస్ట్.. ఈసారి ఎలిమినేట్ అయ్యిది కంటెస్టెంట్..!"

  4. "Jabardasth Faima Pregnancy : జబర్దస్త్ ఫైమా ప్రెగ్నెన్సీ వార్తలో ట్విస్ట్.. నెటిజన్ల ఫైర్ అస‌లేం జ‌రిగిందంటే..?"

  5. "Bigg Boss Telugu 10 : అతను చాలా మంచివాడు.. ఓటేసి గెలిపించండి.. జిమ్ జిమ్ తార లక్ష్మీదేవి వీడియో వైరల్..!"

  6. "Jio Plan : గుడ్‌న్యూస్‌.. జియోలో రూ.123కే రీఛార్జ్ ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ, 14GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్..!"

  7. "Railway Ticket Price : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 47 రైళ్ల టికెట్ ధరలు తగ్గింపు"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp