Home » Andhra Pradesh » Tdp Support Media Huge Sketch With Nara Brahmani
andhra pradesh

Nara Brahmani : నారా బ్రాహ్మణితో తెలుగుదేశం పార్టీ మద్దతు మీడియా భారీ స్కెచ్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: September 20, 2023, 11:00 am
Advertisement

Nara Brahmani : ఒక్క చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోవటం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోసం టీడీపీ లీగల్ టీం అదేవిధంగా నారా లోకేష్ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో గత కొద్ది రోజుల నుండి లోకేష్ భార్య నారా బ్రాహ్మణి రాజకీయంగా చాలా యాక్టివ్ గా ఉంటూ ఉన్నారు. లోకేష్ కంటే కూడా చాలా బాగా మాట్లాడుతూ నిరసన కార్యక్రమాలలో హోరెత్తిస్తున్నారు.

Advertisement

కరెక్ట్ పాయింట్ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు విషయంలో జరిగిన అన్యాయం సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో… వివరిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఎప్పుడూ చంద్రబాబుకి బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బలమైన కుటుంబ నేపథ్యం తో పాటు.. మాట్లాడే సత్తా ఉండటంతో చంద్రబాబు కూర్చోవాల్సిన కుర్చీలో నారా బ్రాహ్మణి నీ కూర్చోబెట్టడానికి.. ఎల్లో మీడియా అధినేతలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. లేడీస్ సెంటిమెంట్ రాజకీయాలలో బాగా పనిచేస్తుందని ఈ రకంగా ఎన్నికలలోకి వెళ్ళటానికి.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలుతో… మద్దతు మీడియా ఎల్లో మీడియా అధినేతలు మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

TDP support media huge sketch with nara brahmani

Advertisement

మొన్న రాజమండ్రిలో జరిగిన క్యాండిల్ ర్యాలీలో బ్రాహ్మణి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. ఆమె స్పీచ్ విని తెలుగుదేశం పార్టీ నేతలు ఝాన్సీ లక్ష్మీబాయి అంటూ అభివర్ణించడం జరిగింది. కచ్చితంగా పార్టీని నడిపించే నాయకత్వ లక్షణాలు నారా బ్రాహ్మణిలో ఉన్నాయని అంటున్నారు. దీంతో జరగబోయే ఎన్నికల సమరంలో నారా బ్రాహ్మణి కీలకపాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి