Ys Jagan : పుట్టిన రోజున జగన్ ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే – జగన్ ఇచ్చిన గిఫ్ట్ కి మైమరచిపోయాడు !
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ప్రస్తుతం చాలా బలంగా ఉన్న సంగతి తెలిసిందే. కారణం 2019 ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన చాలా హామీలను 90 శాతానికి పైగానే జగన్ అమలు చేయడం జరిగింది. దీంతో ప్రజలు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న జగనే సీఎం చేయటానికి రెడీగా ఉన్నట్లు చాలా సర్వేలలో ఫలితాలు ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇటీవల “టైమ్స్ నౌ” సర్వేలో రాష్ట్రంలో 25 ఎంపీ సీటులకు 24 వైసీపీ గెలవబోతున్నట్లు ఫలితాలు వచ్చాయి.
ఇదే సమయంలో జగన్ తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ రిపోర్టులలో వెలువడే ఫలితాల ద్వారానే వచ్చే ఎన్నికలలో టికెట్లు కేటాయింపు ఉంటుందని ఇప్పటికే నేతలకు స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు పుట్టినరోజు నాడు సీఎం జగన్ ఊహించని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అంట. మేటర్ లోకి వెళ్తే 2004, 2009, 2019 ఎన్నికలలో కన్నబాబు రాజు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో గెలవడం జరిగింది. ఈసారి ఎలమంచిలి నియోజకవర్గం పొత్తులో భాగంగా… జనసేన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
mla who came to Ys jagan house on his birthday
ఏది ఏమైనా ఇటీవల కన్నబాబు రాజు పుట్టినరోజు నాడే మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు.. టికెట్ కన్ఫామ్ అయినట్లు విశాఖ వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్వయంగా తెలియజేయడం జరిగిందట. దీంతో కన్నబాబు రాజు కేడర్ పుట్టినరోజు నాడు.. పార్టీ అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ చేయడం పట్ల సంబరాలు చేసుకుంటున్నారట.
