
Venu Swamy : వేణు స్వామి యూటర్న్.. వైసీపీకి హడలెత్తించేలా జ్యోతిష్కుడి కామెంట్స్..!
Venu Swamy : సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు వేణు స్వామి. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. సమంత, నాగచైతన్యలు వైవాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పిన వేణు స్వామి.. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు.రాజకీయ నాయకుల జాతకాలు గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణు స్వామి చెప్పడం జరిగింది.
ఆయన చెప్పినట్టుగానే చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్ట్ అయ్యారు. . కవిత జాతకంలో జైలుకు వెళ్లే యోగం ఉందని వేణు స్వామి ముందే చెప్పారు.వేణు స్వామి చెప్పిన కొద్ది రోజుల్లో లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అయ్యారు. ఏపీ ఎన్నికలకు ముందు.. వేణు స్వామి.. పెద్ద సంచలనం అయ్యారు. “నేను చెప్తున్న కదా.. ఏపీలో మళ్లీ జగన్ గారే ముఖ్యమంత్రి అవుతరు. రాసిపెట్టుకో అంటూ తన తెలంగాణ యాసలో ఆయన యూట్యూబ్ ఇంటర్వ్యూలను ఇరగదీశారు. ఈ క్రమంలో జగన్ జాతకాన్ని కూడా ఆయన వివరించారు. జగన్‌కు ఉన్న దోషం పోయిందని.. ఇప్పుడు ఆయన గ్రహాలన్నీ ఉచ్ఛ స్థితిలో కొనసాగుతున్నాయని చెప్పారు. అందుకే.. రాజయోగం.. కొనసాగుతుందని అన్నారు. మొత్తంగా వేణు స్వామి చెప్పిన ఈ వీడియోను వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైరల్ చేశారు.
Venu Swamy : వేణు స్వామి యూటర్న్.. వైసీపీకి హడలెత్తించేలా జ్యోతిష్కుడి కామెంట్స్..!
ఇక తాజాగా వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ 79 సీట్లలో వన్ సైడ్ గా గెలుస్తుందని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. 79 సీట్లలో వన్ సైడ్ గా గెలుస్తుండటంతోపాటు 30 నుంచి 40 సీట్లలలో టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపారు. మొత్తంగా 95 సీట్ల నుంచి 125 సీట్ల వరకు వైసీపీ విజయం సాధించే అవకాశాలున్నాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారంటూ వేణు స్వామి కుండ బద్దలు కొట్టారు. అయితే 2024లోనే కాకుండా 2029 ఎన్నికలలో కూడా జగన్ సీఎం అవుతారంటూ వేణు స్వామి జోస్యం చెప్పారు . గతంలో కంటే ఎక్కువ స్థానాలే గెలుస్తామని జగన్ చెప్పిన దానికంటే కొన్ని స్థానాలు తగ్గుతాయని వేణు స్వామి చెప్పడంతో వైసీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.