Vijaysai Reddy : ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటే… ఇటు ఏపీలో మాత్రం ఎంపీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దాంతో ఇక్కడ ఏం జరుగుతుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇక ఏపీలో మరోసారి వైసీపీ గాలి వీస్తుందని సర్వేలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంపీ సీట్లు కూడా వైసీపీనే ఎక్కువగా గెలుచుకుంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ కు కుడిభుజంగా ఉండే విజయసాయిరెడ్డి మీదనే అందరి దృష్టి పడింది. నెల్లూరు నెంచి ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన చాలానే హామీలు ఇస్తున్నారు.
అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం నెల్లూరుకు ఎయిర్ పోర్టు తేవడం. ఇప్పటి వరకు విశాఖపట్నంకు తప్ప ఏపీలో ఎక్కడా కూడా ఎయిర్ పోర్టు లేదు. అలాంటిది ఆయన నెల్లూరుకు ఎయిర్ పోర్టు తెస్తానని చెప్పడం మాత్రం అందరికీ షాకింగ్ గానే ఉంది. ఒక ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి ఇంత పెద్ద హామీ ఇవ్వడం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన గెలిచినా సరే అటుకేంద్రంలో ఎలాంటి పదవి రాదు. కేవలం ఎంపీగానే ఉంటారు. అలాంటిది తననను గెలిపిస్తే నెల్లూరుకు ఎయిర్ పోర్టు తెస్తానని ఆయన చెప్పడం ఒక షాక్.
అయితే దానిపై తాజా ఇంటర్వ్యూలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. మీరు నెల్లూరుకు ఎయిర్ పోర్టు తెస్తానని చెప్పారు అది అసలు సాధ్యమేనా అని యాంకర్ ప్రశ్నించారు. దానికి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ అది కచ్చితంగా సాధ్యమే అవుతుంది. ఎందుకంటే నేను ఎనిమిదేండ్లుగా ఎంపీగా పని చేశారు. నాకు కేంద్రంలో ఎన్నో పరిచయాలు ఉన్నాయి. బీజేపీలో ఉండే కేంద్ర మంత్రులు కూడా నాకు చాలా సపోర్టివ్ గానే ఉంటారు. అంతే కాకుండా చాలా పనులు కూడా నాకు చేసి పెడుతారు. నాకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సపోర్టు కూడాచాలానే ఉంది. కాబట్టి నాకు ఎయిర్ పోర్టు తెప్పించడం పెద్ద కష్టమేం కాదు. అందుకే నేను ఎంపీ ఎన్నికల్లో ఆ హామీని ఇచ్చాను. ఇప్పటి వరకు నేను ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చాను. ఇప్పుడు ఈ హామీ కూడా నెరవేరుస్తాను అంటూ చెప్పుకొచ్చాడు విజయసాయిరెడ్డి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.