Home » Andhra Pradesh » Visakhapatnam Murder Case Navy Employee Kills Woman Chops Body Into Pieces And Stores In Fridge At Gajuwaka
andhra pradesh

Visakhapatnam Murder Case : అప్పుడు డ్ర‌మ్ము.. ఇప్పుడు ఫ్రిడ్జ్‌.. మీర‌ట్ ను మించిన వైజాగ్ స్టోరీ.. అస‌లేం జ‌రిగింది..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: March 30, 2026 4:06 pm
Advertisement

Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య ఉదంతాన్ని తలపించేలా.. విశాఖ నగర నడిబొడ్డున ఒళ్లు గగుర్పొడిచే అత్యంత పాశవికమైన ఘటన చోటుచేసుకుంది. ఒక యువతిని తన ప్లాట్‌కు పిలిపించుకున్న ఓ నేవీ ఉద్యోగి.. విచక్షణ కోల్పోయి మృగంగా మారాడు. ఆమెను దారుణంగా హతమార్చడమే కాకుండా, పోలీసులకు సాక్ష్యాలు దొరకకూడదనే ఉద్దేశంతో మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో Fridge దాచిపెట్టాడు. నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడంతో ఈ దారుణమైన క్రైమ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది.

Advertisement

Visakhapatnam Murder Case : అప్పుడు డ్ర‌మ్ము.. ఇప్పుడు ఫ్రిడ్జ్‌.. మీర‌ట్ ను మించిన వైజాగ్ స్టోరీ.. అస‌లేం జ‌రిగింది..!

Visakhapatnam Murder Case అసలు ఏం జరిగిందంటే

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర (35) అనే వ్యక్తి ఇండియన్ నేవీలో Indian Navy ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉద్యోగ రీత్యా అతడు విశాఖలోని గాజువాక పరిధిలో ఉన్న ఎల్.బి.నగర్ ‘కీర్తి ఎన్‌క్లేవ్’ అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. రవీంద్రకు వివాహం కూడా అయ్యింది. అయితే, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయో ఏమో కానీ, అతని భార్య గత నెల రోజులుగా విజయనగరంలోని తన పుట్టింట్లోనే ఉంటోంది.

Advertisement

ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న రవీంద్రకు, విశాఖలోని సాలగ్రామపురానికి చెందిన మౌనిక (29) అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సన్నిహితంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సమయంలో మౌనికను గాజువాకలోని తన ఫ్లాట్‌కు పిలిపించుకున్నాడు రవీంద్ర. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఇద్దరి మధ్య ఏదో ఆర్థిక లావాదేవీల విషయంలో పెద్ద గొడవ జరిగింది. ఆ వివాదం ముదరడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రవీంద్ర.. క్షణికావేశంలో మౌనికను అతి దారుణంగా హత్య చేశాడు.

Visakhapatnam Murder Case తల ఎక్కడ? ఫ్రిజ్‌లో శరీర భాగాలు

హత్య చేసిన అనంతరం రవీంద్రలో భయం మొదలైంది. మృతదేహాన్ని అలానే ఉంచితే ఇరుక్కుపోతానని భావించిన ఆ కిరాతకుడు.. సినిమా ఫక్కీలో ఆధారాలను మాయం చేయాలని ప్లాన్ వేశాడు. పదునైన ఆయుధంతో మౌనిక శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ మాంసం ముక్కలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి, రక్తం బయటకు రాకుండా తన ఇంట్లోని ఫ్రిజ్‌లో (Refrigerator) భద్రపరిచాడు. అయితే, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. మృతదేహంలోని తల భాగం మాత్రం ఫ్రిజ్‌లో కానీ, ఫ్లాట్‌లో కానీ కనిపించలేదు. తలను ఎక్కడైనా తీసుకెళ్లి పడేశాడా? లేక మరెక్కడైనా దాచాడా? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు

మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత.. ఇక తాను పోలీసుల కళ్లు గప్పలేనని రవీంద్రకు అర్థమైంది. దీంతో ఆదివారం రాత్రి సమయంలో నేరుగా గాజువాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తానొక యువతిని హత్య చేసి ఫ్రిజ్‌లో దాచానని నేరాన్ని అంగీకరించి లొంగిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా.. ఫ్లాట్ అంతా రక్తసిక్తంగా మారి ఉంది. ఫ్రిజ్ తెరిచి చూడగా అందులో కవర్లలో చుట్టిన శరీర భాగాలు లభ్యమయ్యాయి.

హత్యకు కారణం వేధింపులేనా?

పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు రవీంద్ర పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మౌనిక గత కొంతకాలంగా తనను డబ్బుల కోసం తీవ్రంగా బ్లాక్ మెయిల్ చేస్తోందని, పదే పదే డబ్బులు ఇవ్వాలని వేధిస్తోందని చెప్పాడు. ఆ మానసిక ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేకే ఈ ఘతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. అయితే, పోలీసులు మాత్రం నిందితుడి మాటలను పూర్తిగా విశ్వసించడం లేదు. ఇది కేవలం నేరం నుండి, శిక్ష నుండి కొంతమేర తప్పించుకోవడానికి చెబుతున్న కట్టుకథనా? లేక నిజంగానే వారి మధ్య ఆర్థిక వివాదాలు, బ్లాక్ మెయిలింగ్ లాంటివి ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు.

ఉలిక్కిపడ్డ గాజువాక వాసులు.. శోకసంద్రంలో కుటుంబం

అత్యంత రద్దీగా ఉండే, ఎప్పుడూ జనసంచారం ఉండే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఇలాంటి ఘోరం జరగడంతో కీర్తి ఎన్‌క్లేవ్ వాసులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో అపార్ట్‌మెంట్‌లోకి యువతి రావడం, ఆ తర్వాత ఇంత పెద్ద క్రైమ్ జరగడం స్థానికుల్లో ఎవరూ గమనించకపోవడం గమనార్హం. క్రమశిక్షణకు మారుపేరైన ఒక బాధ్యతాయుతమైన ఇండియన్ నేవీ ఉద్యోగంలో ఉండి, ఇలాంటి అమానుష చర్యకు పాల్పడటం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది.

గాజువాక సీఐ పార్థసారథి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఫ్లాట్‌లో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. నిందితుడు రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు, హత్యకు, శరీరాన్ని కోయడానికి వాడిన కత్తులను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, ఈ దారుణ వార్త విన్న మౌనిక కుటుంబ సభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి