Ys Jagan : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాజాగా నిర్వహించిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ షర్మిల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ముందుగా అక్కడికి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడుతూ జగనన్నకు తోడేళ్ల మద్దతు లేదు , నక్కజిత్తులు చేసే అలవాటు లేదు, మోసం చేసే అలవాటు లేదు, అబద్ధాలు చెప్పే అలవాటు లేదు మీ జగనన్నకు అని ప్రతి ఇంట్లో చెప్పండి అంటూ తెలియజేశారు. దిగజారిన పార్టీలన్నీ ఒకటిగా చేరి జగనన్ననే టార్గెట్ గా , పేదవాడి సంక్షేమాన్ని టార్గెట్ గా వారంతా కూడా కలిసి ఆయుధాలను రెడీ చేసుకుంటున్నారు. వారందరితో యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా అని జగన్ ప్రస్తావించారు. ఇక ఈ యుద్ధం 15 ఏండ్లుగా నాకు అలవాటే ఇన్నాళ్లు మీరు నాతో నడిచారు కాబట్టి మీకు అలవాటే.
ఇది ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడిన నా ఒక్కడి మీద కలబడేందుకు 100 మంది కలిసి 100 బాణాలు వేస్తున్నప్పుడుప్రజలే రక్షణ కవచంగా ప్రజలలో నుండి పుట్టిన పార్టీ ఈ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. మీ చేతిలో కనిపిస్తున్న జెండాకి అర్థం..నా ఒక్కడి మీద దేశంలొ కెల్లా బలమైన10 వ్యవస్థలను ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా. 100 బాణాలని కౌరవ సైన్యాన్ని మరోసారి ఎదుర్కొనేందుకు మరోసారి గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరంతా కూడా సిద్ధమా అని అడుగుతున్నానంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఈ పార్టీని మీ అన్నని అభిమానించే ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క అభిమానికి ,ప్రతి ఒక్క వాలంటీర్ కి ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేయాలి అనుకుంటున్నా.
వీరితోపాటు ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సిపి వార్డు నెంబర్ ల నుండి సర్పంచుల వరకు ,ఎంపీటీసీల దగ్గర నుండి ఎంపీపీ వరకు ,జడ్పిటిసి నుండి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ,మున్సిపల్ కౌన్సిలర్ దగ్గర నుండి మున్సిపల్ చైర్మన్ వరకు ,కార్పొరేటర్ దగ్గర నుండి మేయర్ ల వరకు ,నామినేటెడ్ పోస్టులలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ,ఒకటే చెబుతా ఉన్నాను. ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది మీ అందరి పార్టీ అంటూ జగన్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ భారీ బహిరంగ సభలో జగన్ షర్మిల గురించి మాట్లాడుతూ చంద్రముఖి పోల్చారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.