Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆలోచలనలని జగన్ కాపీ కొడుతున్నాడా..ఏం జరుగుతుంది..!
Pawan Kalyan : అధికారంలో ఐదేళ్లు ఉండి, ఆ తర్వాత పదవి పోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు జగన్‌ని చూస్తే అర్ధమవుతుంది. మళ్లీ అధికారంలోకి వస్తానని ఆశతో ఉన్న జగన్‌కి ఏపీ ప్రజలు పెద్ద షాకే ఇచ్చారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో కూడా లేడు. ఈ క్రమంలో తిరిగి అధికారం తెచ్చుకునేందుకు కుస్తీ పడుతున్నాడు. ఏపీలో జరుగుతున్న ప్రతి విషయంపై స్పందిస్తూ వార్తలలో నిలుస్తున్నారు. వరుసగా ఆడ పిల్లల మీద జరుగుతున్న దారుణాలకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. పిఠాపురంలో టీడీపీ నేతే అత్యాచారం చేస్తే బాధితురాలిని పవన్ కనీసం పరామర్శించ లేదని విమర్శించారు. బాధిత మహిళల కు తమ పార్టీ నుంచి రూ 10 లక్షల చొప్పున జగన్ ఆర్దిక సాయం ప్రకటించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.
పిఠాపురంలో టీడీపీ నేతే అత్యాచారినికి పాల్పడితే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ కనీసం పరామర్శించ లేదని జగన్ ఆరోపించారు. హిందూపురంలో అత్తా కోడలి పైన గ్యాంగ్ రేప్ జరిగితే నందమూరి బాలక్రిష్ణ పరామర్శించ లేదని జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనల పైన హోం మంత్రి స్పందించటం లేదని ఆరోపించారు. జగన్‌లో ఈ మార్పు చూసి అందరు షాక్ అవుతున్నారు. గతంలో ఈ స్థాయిలో ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడింది లేదు. జగన్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా తరచూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలకు సమయం కేటాయిస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజల మధ్యకు వెళ్తూ సీఎం కాకముందు జగన్ ఎలా ఉండేవారో..అదే రీతిన ఇప్పుడు కనిపించే ప్రయత్నం చేస్తూ తాను మారాననే సంకేతాలు ఇస్తున్నారు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆలోచలనలని జగన్ కాపీ కొడుతున్నాడా..ఏం జరుగుతుంది..!
జగన్.. పవన్ కళ్యాణ్‌ని కాపీ కొడుతున్నారనే టాక్ వినిపించింది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో జనసేనాని పవన్ కౌలు రైతుల కోసం తన సొంత నిధుల నుంచి సాయం చేసారు. ఆ నిర్ణయం ప్రజల్లో పవన్ పైన సానుకూలత పెరగటానికి దోహదం చేసింది. విజయవాడ వరదలతో పాటుగా విజయనగరం జిల్లాలో డయేరియా కారణంగా మరణించిన కుటుంబాలకు పవన్ వ్యక్తిగతంగా ఆర్దిక సాయం ప్రకటించారు. ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారు .కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన దాడులు, అత్యాచార బాధిత కుటుంబాలకు రూ 10 లక్షల చొప్పున తమ పార్టీ నుంచి ఆర్దిక సాయం చేస్తామని జగన్ ప్రకటన చేసారు. డయారేయా వలన మరణించిన వారికి సొంత నిధుల నుండి రెండు లక్షల చొప్పున ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే పవన్ మాదిరిగానే తాను ప్రజలలో సింపథీ పొంది
మళ్లీ అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారా అని ముచ్చటించుకుంటున్నారు.
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
This website uses cookies.