Ys Jagan : వైకాపాలో నెం.2 అంటే ఎక్కువ మంది ఠక్కున చెప్పే పేరు విజయసాయి రెడ్డి. ఈయన 2019 ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా విజయ సాయి రెడ్డి ఉత్తరాంద్రపై దృష్టి పెట్టి అక్కడ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా చేయడంతో పాటు వైఎస్ జగన్ ను సీఎంగా చేయడంలో కూడా కీలకంగా మారాడు అంటారు. గడచిన అయిదు ఆరు సంవత్సరాలుగా ఉత్తరాంద్రపై ప్రత్యేక దృష్టితో ముందుకు వెళ్తున్న విజయ సాయి రెడ్డికి అక్కడ కొంత మంది అంతర్ఘత విరోదులు కూడా అయ్యారు. అంటే కొందరు వైకాపా నాయకులు ఎమ్మెల్యేలు మరియు మంత్రులు కూడా విజయ సాయి రెడ్డికి వ్యతిరేకంగా మారారు. వారు అత్యంత కీలకంగా ఈ విషయంలో వ్యవహరిస్తున్నారు. విజయ సాయి రెడ్డి ఉత్తరాంద్ర జిల్లాల్లో వైకాపా ను సమర్థ వంతంగా నడిపిస్తున్నాడు అంటూ కొందరు భావిస్తున్నా కూడా కొందరు మాత్రం ఆయన డామినేషన్ ను తట్టుకోలేక పోతున్నారు.
విజయ సాయి రెడ్డికి షాక్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సొంత పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనకు షాక్ ఇచ్చే విషయమై కొందరు ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఉత్తరాంద్రకు రాజధానిని మార్చాలని భావిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సమయంలో అక్కడ పార్టీ విభేదాలు ఉంటే ఏమాత్రం బాగుండదనే ఉద్దేశ్యంతో ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతల నుండి విజయ సాయి రెడ్డిని తప్పించే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వైకాపా నాయకులు మరియు కొందరు మంత్రుల విజ్ఞప్తి మేరకు వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఉత్తరాంధ్రలో ఇప్పటికే పార్టీపై పూర్తి పట్టును సాధించిన విజయ సాయి రెడ్డిని తప్పిస్తే వైఎస్ జగన్ తన వేలితో తన కన్నును పొడుచుకున్న వాడు అవుతాడని ఈ విషయంలో కాస్త ఆలోచించాలని లేదంటే అతడు పూర్తిగా విఫలం అయినట్లే అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విజయ సాయి రెడ్డిని పార్టీ బాధ్యతల నుండి వైఎస్ జగన్ తప్పిస్తాడని తాము భావించడం లేదని కొందరు వైకాపా నాయకులు అంటున్నారు. పార్టీ కి క్రియాశీలకంగా ఉన్న విజయ సాయి రెడ్డిని తప్పించి ఆయన్ను అన్యాయం చేయవద్దని కొందరు వైఎస్ జగన్ కు విజ్ఞప్తులు చేస్తున్నారు. మరి జగన్ నిర్ణయం ఏంటీ అనేది కొన్ని రోజుల్లోనే వెళ్లడయ్యే అవకాశం ఉంది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.