YS Jagan: ఫిబ్రవరి 1 న వైఎస్ జగన్ భారీ బహిరంగ సభ – ఆకాశం భూమీ ఏకం అయ్యేంత జనం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లడం సీఎం వైఎస్ జగన్ కు అస్సలు ఇష్టం లేదనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. కాని కోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయంలో ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఎన్నికలకు సిద్దం అవ్వడమే బెటర్ అనే నిర్ణయానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండ్ టీం వచ్చేశారు. ఈ సమయంలో ఎన్నికల్లో కాస్త మెజార్టీ తగ్గినా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన విజయాన్ని మరింతగా నిరూపించుకున్నట్లుగా అవుతుంది. దానికి తోడు విపక్షాల వద్ద చులకన అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నికల్లో అన్న విధాల ప్రయత్నాలు చేసి ఘన విజయం సాధించడమే లక్ష్యం అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఈ విషయంలో వైఎస్ జగన్ అండ్ టీం తీవ్రంగా ప్రయత్నాలు చేయబోతున్నారు.
YS Jagan: ఎన్నికల నగారా మ్రోగించనున్న వైఎస్ జగన్…
ఎన్నికల కోసం సీఎం వైఎస్ జగన్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నట్లుగా వైకాపా నాయకులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో మొత్తం రాయలసీమ జనాలు వచ్చేలా భారీ బహిరంగ సభను సీఎం నిర్వహించడం ద్వారా ఎన్నికల ప్రచార నగారా మ్రోగించినట్లు అవుతుందని అంటున్నారు. సాదారణంగా అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సీఎంలు పెద్దగా పట్టించుకోరు. కాని తాము చేసిన అభివృద్ది పనులు చెప్పుకోవాలనే ఉద్దేశ్యంతో జగన్ అనంతపురం జిల్లాలో బహిరంగ సభకు సిద్దం అవుతున్నాడని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. జగన్ అంతకు మించి ఏ ప్రచారంలో పాల్గొనబోవడం లేదని కూడా అంటున్నారు. జగన్ అనంతపురంలో రేషన్ వాహనాల పంపిణీ కోసం ఫిబ్రవరి 1న వెళ్లబోతున్నాడు. ఆ సమయంలోనే భారీ బహిరంగ సభ ఉంటుందని అంటున్నారు.
రేషన్ వాహనాల విషయంలో గందరగోళం…
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన రేషన్ వాహనాల విషయలో కూడా కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ వాహనాలను ఎస్‌ఈసీ అనుమతిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ ఆ వాహనాల ప్రారంభంను అనుమతిస్తే ఖచ్చితంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వయంగా రేషన్ పంపిణీ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆ తర్వాత బహిరంగ సభ ఉంటుంది. వైఎస్ జగన్ బహిరంగ సభ కోసం అనంతపురం జిల్లా వైకాపా నాయకులు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. భూమి ఆకాశం కలిసి పోయిందా అన్న రీతిలో జనాలను సమీకరించేందుకు కోట్లు ఖర్చు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.