Ys Jagan : ఏపీ మాజీ సీఎం జగన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఆయన ఈ మధ్య మళ్లీ ప్రజలలోకి వస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాగా, అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి.గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే వైసీపీ సభ్యులు సేవ్ డెమోక్రాసీ అంటూ నినాదాలు ప్రారంభించారు. అసెంబ్లీకి వైసీపీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ నల్లకండువాలతో వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో “హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ” అంటూ నినాదాలు చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో వస్తోన్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు జగన్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ఫ్లకార్డులను లాక్కుని, చింపివేశారు పోలీసులు. దీంతో… జగన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా… “ఇలా ప్రజా ప్రతినిధుల చేతిలో నుంచి ఫ్లకార్డులు లాక్కుని చించే అధికారం ఎవరిచ్చారు” అంటూ పోలీసులపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదే సందర్భంలో ఈ సమయంలో వైసీపీ నేతల చేతిలో ఉన్న ఫ్లకార్డులను పోలీసులు చించివేశారంటూ జగన్ ఫైర్ అయ్యారు.
పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సందర్బంలో అక్కడున్న పోలీసు అధికారిని ఉద్దేశించి… “మదుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో.. ఎల్లకాలం ఇదేమాదిరి ఉండదు.. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం.. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్ధం ఏమిటో తెలుసా?.. అధికారంలో ఉన్నవాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు.. ప్రజస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరు ఉన్నారు” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జగన్‌లో ఈ ఫైర్ కావాలని, గతంలో మాదిరిగా నవ్వుకుంటూ పోతే మనల్ని ఎవరు కూడా పట్టించుకోరు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
This website uses cookies.