Ys Jagan : జ‌గ‌న్ ఈజ్ బ్యాక్.. మ‌ధుసూధ‌న్ రావు గుర్తు పెట్టుకో అంటూ ఫైర్..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 22 July 2024, 4:00 pm
  •  Ys Jagan : జ‌గ‌న్ ఈజ్ బ్యాక్.. మ‌ధుసూధ‌న్ రావు గుర్తు పెట్టుకో అంటూ ఫైర్

Ys Jagan : ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చారు. ఆయ‌న ఈ మ‌ధ్య మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌లోకి వ‌స్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తూ వ‌స్తున్నారు. అయితే నేటి నుండి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు మొద‌లు కాగా, అనేక ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకున్నాయి.గవర్నర్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన వెంటనే వైసీపీ సభ్యులు సేవ్ డెమోక్రాసీ అంటూ నినాదాలు ప్రారంభించారు. అసెంబ్లీకి వైసీపీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ నల్లకండువాలతో వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో “హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ” అంటూ నినాదాలు చేశారు.

Ys Jagan ఫుల్ ఫైర్‌లో జ‌గ‌న్

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో వస్తోన్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ స‌మ‌యంలో పోలీసులకు జగన్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ఫ్లకార్డులను లాక్కుని, చింపివేశారు పోలీసులు. దీంతో… జగన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా… “ఇలా ప్రజా ప్రతినిధుల చేతిలో నుంచి ఫ్లకార్డులు లాక్కుని చించే అధికారం ఎవరిచ్చారు” అంటూ పోలీసులపై తీవ్ర‌మైన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదే సందర్భంలో ఈ సమయంలో వైసీపీ నేతల చేతిలో ఉన్న ఫ్లకార్డులను పోలీసులు చించివేశారంటూ జగన్ ఫైర్ అయ్యారు.

Ys Jagan : జ‌గ‌న్ ఈజ్ బ్యాక్.. మ‌ధుసూధ‌న్ రావు గుర్తు పెట్టుకో అంటూ ఫైర్..!

Ys Jagan : జ‌గ‌న్ ఈజ్ బ్యాక్.. మ‌ధుసూధ‌న్ రావు గుర్తు పెట్టుకో అంటూ ఫైర్..!

పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంద‌ర్బంలో అక్కడున్న పోలీసు అధికారిని ఉద్దేశించి… “మదుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో.. ఎల్లకాలం ఇదేమాదిరి ఉండదు.. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం.. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్ధం ఏమిటో తెలుసా?.. అధికారంలో ఉన్నవాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు.. ప్రజస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరు ఉన్నారు” అంటూ ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. జ‌గ‌న్‌లో ఈ ఫైర్ కావాలని, గ‌తంలో మాదిరిగా న‌వ్వుకుంటూ పోతే మ‌న‌ల్ని ఎవ‌రు కూడా ప‌ట్టించుకోరు అంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి