
YS Sharmila : అన్న మంచోడే కానీ వదినే ..?? తెరపైకి వైయస్ భారతి రెడ్డిని తీసుకొచ్చిన వైయస్ షర్మిల..!
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల జెట్ స్పీడ్ లో దూసుకెళుతున్నారు. ఎదురొచ్చిన వారిని, తనని విమర్శించిన వారిని ఖండ ఖండాలుగా నరికేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైయస్ షర్మిల ఇంటిపట్టున ఉండే వైయస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతీ రెడ్డి ని కూడా వివాదాల్లోకి లాగేందుకు ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడిన మాటలు, వాడిన పదజాలం వివాదాలకు కేంద్ర బిందు అయ్యే అవకాశం కూడా ఉంది. వైయస్ షర్మిల మాటల దాడిని పెంచారు. తనపై విమర్శలు చేస్తున్న వైసీపి నేతలను జోకర్లతో పోల్చారు వైయస్ జగన్ పరివారం పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, వైఎస్ జగన్ ను జైల్లో పెట్టించాలని అప్పటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తన భర్త అనిల్ కోరారు అన్నది అబద్ధమని మండిపడ్డారు. తన వదిన వైయస్ భారతి రెడ్డి తో కలిసే సోనియా గాంధీ వద్దకు తన భర్త వెళ్లారని, వారు చెప్పేది నిజమే అయితే భారతీ రెడ్డి తో ఈ విషయం చెప్పిస్తారా అని సవాల్ విసిరారు. సోనియా గాంధీ వద్దకు ఎప్పుడు వెళ్లిన తన వదిన భారతీ రెడ్డి తో కలిసే వెళ్లారని అన్నారు.
షర్మిలను సీఎం చేయండి అని నా భర్త అనిల్ సోనియాకు ముందే చెప్పారా లేక వెనక చెప్పారా..దీనికి భారతీ రెడ్డి సాక్ష్యం చెబుతారా..అసలు ఈ విషయాన్ని ఎక్కడైనా ప్రణబ్ ముఖర్జీ బహిరంగ చెప్పారా..ఇప్పుడు ఆయన లేరు..ఆయన కుమారుడుతో అయిన చెప్పిస్తారా అని, వైసీపీకి కుట్రలు కుతంత్రాలకు అడ్డు అదుపు లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు.అయితే వైయస్ విజయమ్మను వైయస్ షర్మిలను దూరం పెట్టడానికి కారణం వైయస్ భారతి రెడ్డి అని అంటున్నారు. ఆస్తిలో ఎంతో కొంత వైయస్ షర్మిలకు ఇద్దామని వైయస్ జగన్ అనుకున్నా, అందుకు వైయస్ భారతి రెడ్డి ఒప్పుకోలేదని టాక్ వినిపిస్తోంది. అందుకే వైయస్ షర్మిలకు తన అన్న వైయస్ జగన్ పై కన్నా వదిన భారతి రెడ్డి పై ఎక్కువ కోపం ఉందని చెబుతున్నారు. గతంలో వైయస్ జగన్ జైలుకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేదానిపై తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో వైయస్ భారతి రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కథనాలు వచ్చాయి. ఇది ముమ్మాటికి భారతీ రెడ్డి ప్రోత్బలంతోనే జరిగిందని షర్మిల అనుమాన పడుతున్నారు.
జగన్ ఇంట్లోకి ఫ్రీగా వెళ్లక పోవడానికి భారతి తీరే కారణం అని వైఎస్ షర్మిల ఆగ్రహం చెందుతున్నారు. పైగా వైయస్ జగన్ చుట్టూ ఉన్న బ్యాచ్ మొత్తం వైయస్ భారతి చెప్పు చేతల్లో ఉన్నారని ప్యాలెస్ లో ఆమె పెత్తనం నడుస్తుందని వైయస్ షర్మిల భావిస్తున్నారు. అదే అన్న పక్కన తాను ఉంటే సీన్ వేరేలా ఉండేదని వైఎస్ కుటుంబ సభ్యురాలుగా గౌరవం ఉండేదని నమ్ముతున్నారు. పైగా సాక్షి మీడియా వైఎస్ భారతి రెడ్డి ఆదేశాలతోనే నడుస్తుందని తెలుసుకున్న షర్మిల ఆ సంస్థలో తనకు సగభాగం వాటా ఉందని చెప్పుకొస్తున్నారు. ఇక వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు వైయస్ భారతి రెడ్డి సమాధానం ఇస్తారా లేక వేరే వాళ్ళతో చెప్పిస్తారా అనేది చూడాలి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.