Ys Sharmila : ఏపీలో AP News జగన్ Ys Jagan , షర్మిళ మధ్య జరుగుతున్న ఫైటింగ్ చర్చనీయాంశంగా మారడం మనం చూశాం. అయితే వైఎస్ జగన్ Ys Jagan తో తనకు నెలకొన్న Family కుటుంబ ఆస్తుల వైరాన్ని రాజకీయం ద్వారా మరో స్దాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఆయన చెల్లి, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ మాటల దాడిని మరింత తీవ్రం చేశారు. ఇప్పటికే జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదని, వెళ్లకపోతే ఎమ్మెల్యేగా MLAs రాజీనామా చేసేయాలని ఒత్తిడి పెంచుతున్న షర్మిల.. దీనికి రోజుకో కారణాన్ని లింక్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ సూపర్ సిక్స్ పథకాలు, బడ్డెట్ ను జత చేసి పోస్టు పెట్టారు.మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా జగన్ తీరు ఉందంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఏపీ బడ్జెట్ పై జగన్ ప్రెస్ మీట్ ను ఉద్దేశిస్తూ షర్మిల మాట్లాడారు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ Congress Party నాయకులం వైసీపీ కంటే ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం. మేము చెప్పిందే జగన్ మళ్లీ చెప్పారు. మీకు మాకు పెద్ద తేడా లేదు. వైసీపీ 38శాతం ఓట్లు వచ్చినా అసెంబ్లీకి ap assembly budget వెళ్లనప్పుడు.. మీకుమాకు తేడా లేదని షర్మిల అన్నారు.38శాతం ఓటు షేర్ పెట్టుకొని అసెంబ్లీకిపోని వైసీపీని నిజానికి ఒక “ఇన్ సిగ్నిఫికెంట్”పార్టీగా మార్చింది జగన్ మోహన్ రెడ్డి అని, అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యలకోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని అసమర్థ వైసీపీ ఇవ్వాళ రాష్ట్రంలో అసలైన “ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ” అని షర్మిల విమర్శించారు…
ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోవాలని షర్మిల సూచించారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలన్నారు. ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ తేలుతుంది కదా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయాలన్నారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు.. సొంత మైకుల ముందు మాట్లాడటానికి కాదు.. అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని. మీకు చిత్తశుద్ది ఉంటే నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండి అంటూ జగన్ మోహన్ రెడ్డికి షర్మిల సవాల్ చేశారు.
Celebrity Couple : ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకుంటున్నారు. ఇన్నేళ్ల సంసారంలో…
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఇవి చాలా ఎమోషనల్గా…
Brahmam Gari Kalagnanam : ప్రపంచంలో ఒకవైపు ప్రమాదాలు మరోవైపు భారీ నష్టం. ఎక్కడ చూసినా విధ్వంసమే. వరదలు భూకంపాలు అగోరీలు..…
Electric Cycle : మీరు ఉత్తమ శ్రేణి, పనితీరు మరియు ఫీచర్ల యొక్క ఖచ్చితమైన సమ్మేళనాన్ని అందించే విశ్వసనీయ మరియు…
Jamili Elections : కేంద్రం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర, జార్ఖండ్ తో…
Face Packs : ఈ మధ్యకాలంలో అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే సంగతి తెలిసిందే. అందులో ఆడవాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Sukumar : పుష్ప 1 వచ్చి 3 ఏళ్లు అవుతుంది. ఆ సినిమా సీక్వెల్ గా పుష్ప 2 అసలైతే…
Colon Cancer : మీరు మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? ఏదైనా తిన్న వెంటనే కడుపు నిండుగా అనిపిస్తుందా. మీ సమాధానం…
This website uses cookies.