YS Sharmila : ఏపీ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ నడుస్తుంది. అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డి పై గెలవాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూటమిగా ఏర్పడ్డారు. వైయస్ జగన్ ఎలాగైనా అధికార పీఠం నుంచి దింపాలని టీడీపీ, జనసేన బలంగా కోరుకుంటున్నాయి. అయితే అంతకన్నా ఎక్కువగా వైయస్ జగన్ ఓడిపోవాలని వైయస్ షర్మిల కోరుకుంటున్నారు. వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ మీడియా హైప్ చేస్తుంది. ఆమె మాట్లాడే ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ ప్రతి వీడియోను హైలైట్ చేస్తూ వస్తున్నారు. మరో 70, 80 రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు జనాలపై ప్రభావం చూపిస్తాయి. ఇక వైయస్ షర్మిల వైఎస్ సునీతను తన పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కడప నుంచి ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నారు.
తన తండ్రి వివేకానంద రెడ్డిని హత్య చేసిన అంశం పైన గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైఎస్ సునీత కు ప్రజలు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడకుండా కేవలం చట్టాన్ని నమ్ముకుని ముందుకెళుతున్న వైయస్ సునీత తన తండ్రిని చంపిన వారిని ప్రజలకు తెలియజేయాలని ఆమె చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళుతున్నారు. అయితే వైఎస్ సునీతను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చి కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని వైయస్ షర్మిల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వైఎస్ సునీత ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రానని వైయస్ షర్మిలకు తేల్చి చెప్పారట. వైఎస్ సునీతతో పాటు తన భర్త రాజశేఖర్ కూడా రాజకీయాలలోకి రామని కరాకండిగా చెప్పారట. కేవలం వివేకానంద హత్య కేసు మీదే దృష్టి సారించామని, రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోకి రామని ఓపెన్ గా వైయస్ షర్మిలకు తెలిపారట.
ఇది వైయస్ జగన్ కు గుడ్ న్యూస్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు జగన్ కి డ్యామేజ్ అంటే తండ్రి చనిపోయాక రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ సునీత కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తే అది జగన్ కు ఎక్కువ డ్యామేజ్ చేసినట్లు అవుతుంది. అయితే వైఎస్ సునీత రాజకీయాలలోకి రానని చెప్పారు. ఇక వైయస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి రాజకీయాలలో సంచలనంగా మారారు. అలాగే ఆమె దూకుడుతనం, తన అన్న పై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.