Business ldea : తల్లి వదిలేసిన బొమ్మల బిజినెస్ ను తిరిగి స్టార్ట్ చేసి నెలకు లక్షలు సంపాదిస్తున్న కూతురు.. ఎక్కడో తెలుసా?

Business ldea : ఇదొక స్త్రీ విజయగాథ. అనుకున్నది సాధించడానికి తను పడిన కష్టం, తాను చేసిన కష్టం గురించిన స్ఫూర్తి గాథ. వ్యాపారంలో స్థిరపడాలనుకున్న తన కోరికను నెరవేర్చుకోవడమే కాదు… ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. తల్లి వదిలేసిన బొమ్మల బిజినెస్ ను తిరిగి స్టార్ట్ చేసింది. ఇప్పుడు నెలకు లక్షల్లో సంపాదిస్తోంది. ప్రతి నెలా 150కి పైగా ఆర్డర్ లను పంపుతూ, ఈ కంపెనీ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. కిరణ్ బాల మొదట బొమ్మల తయారీ బిజినెస్ ప్రారంభించినప్పుడు అది తన కుమార్తెలకు ఓ మంచి దారి చూపుతుందని, వారిని కూడా అటు వైపు ఆకర్షిస్తుందని ఏనాడు అనుకోలేదు. చిన్నప్పటి నుండి తల్లి చేస్తున్న పనులను, పడుతున్న కష్టాన్ని చూసి పెరిగారు మయూరి, భారతి. అది తల్లి కిరణ్ బాలపై ఓ మంచి అభిప్రాయాన్ని, ఆదర్శాన్ని చిన్నప్పటి నుండే వారిలో ఏర్పరిచింది. ఓ మహిళ తాను అనుకున్నదాని కోసం, కోరిక కోసం ఎంతైనా కష్ట పడగలదని నమ్మారు. కానీ చైనా వస్తువుల రాకతో ఆ బిజినెస్ మూసివేయాల్సి వచ్చింది.మయూరి తన తల్లి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంది.

తన ఆలోచనను తండ్రితో పంచుకుంది. తల్లితోనూ చెప్పింది. బొమ్మల తయారీ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలన్న మాట వినగానే కిరణ్ బాలలో చెప్పలేని ఉత్సాహాన్ని గమనించింది మయూరి. తనకు ఆ వ్యాపారం ఎంత ఇష్టమో ఇది మరోసారి రుజువు చేసిందని ఆనాటి రోజులను గుర్తు చేసుకుటుంది మయూరి. కొన్ని నెలలు మార్కెట్ పరిశోధన, సర్వే మరియు వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో నేర్చుకోవడంలో గడిపారు. అంతర్జాలం వల్ల తక్కువ సమయంలో చాలా విషయాలు నేర్చుకోగలిగానని మయూరి చెప్పారు. విక్రేతలను సంప్రదించడం ప్రారంభించింది మయూరి. వీరిలో కొందరు ఇంతకు ముందు తన అమ్మతో కలిసి పనిచేశారు. బొమ్మల కోసం కొనుగోలు చేసిన ప్రతి వస్త్రాన్ని స్వయంగా తనిఖీ చేసింది. ఆ విధంగా వ్యాపారాన్ని మరోసారి ప్రారంభించింది. 20 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ ప్రారంభించిన తర్వాత, ఇంట్లో ఒక పడకగది నుండి వ్యాపారాన్ని ఎడ్డీ టెడ్డీ అండ్ కోను ప్రారంభించారు. ఫిబ్రవరి 2022లో మయూరి తన ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని ఉదయపూర్‌లో 1,000 చదరపు అడుగుల వర్క్‌షాప్ మరియు ఆఫీసు స్థలాన్ని నిర్మించడానికి పెట్టుబడి పెట్టింది.

daughter revives mother toy business woman entrepreneur lakhs made in india

మార్కెట్‌లోకి వెళ్లాలని, అలాగే తమ వ్యాపారం గురించి అందరికీ తెలియాలని గట్టిగా అనుకున్నారు. అక్కడక్కడ జరిగే మేళాల్లో తమ ఉత్పత్తులతో పాల్గొనేవారు. సోషల్ మీడియాను వాడుకున్నారు. వెబ్ సైట్ ను రూపొందించారు. ఇన్ స్టాగ్రామ్ లో తమ ఉత్పత్తులకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేయడం లాంటివి చేశారు. ఇప్పుడు కేవలం తమ ఉత్పత్తులను అమ్మడమే కాకుండా దాని వెనక ఉన్న కథను చెప్పాలనుకున్నారు. అది నేరుగా కస్టమర్లకు తెలిసేలా ప్రయత్నించారు. మృదువైన బొమ్మలను కొనుగోలు చేసే వ్యక్తులు భారతీయ బ్రాండ్‌లకు అవకాశం ఇవ్వాలని మయూరి విజ్ఞప్తి చేశారు. కేవలం నాణ్యమైన స్పృహతో మాత్రమే కాదు, వర్క్‌షాప్‌ను విడిచిపెట్టిన ప్రతి భాగాన్ని గురించి గర్విస్తారు వారు. రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారాలని కోరుకోవడం లేదని చెబుతోంది మయూరి. ఎడ్డీ టెడ్డీ అండ్ కో బ్రాండ్‌ను స్థాపించడానికి మరియు కస్టమర్‌లతో బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇక్కడ ఉన్నామని అంటుంది. సాఫ్ట్ టాయ్‌ల ప్రారంభ శ్రేణి రూ. 349 కాగా, వారి బెస్ట్ సెల్లర్స్, నూడిల్, కడ్లీ ప్లష్ డాగ్ ధర రూ. 1,299 మరియు ఓలీ, సాఫ్ట్ టాయ్ ఏనుగు ధర రూ. 999. గా వాళ్లు వాటిని అమ్ముతున్నారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago