Post Office : భారతీయ తపాలా శాఖ గ్రామ్ సుమంగళ్ డాక్ జీవన బీమా యోజన అనే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది 19 ఏళ్ళు వయసు ఉన్న పిల్లలతో కుటుంబాలకు ఎంతో గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను కూడా అందించేందుకు తయారు చేయబడింది. కాలాను గుణంగా రాబడి మరియు మెచ్యూరిటీ టైంలో గణనీయమైన హామీ మొత్తంతో తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచాలి అనే సూచనతో వారికి ఈ పథకం ఒక అద్భుతమైన అవకాశం. ఈ పథకం యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1. పథకం రకం : ఇది కాలానికి అనుకూలంగా రాబడి తో పాటు జీవిత బీమా కవరేజ్ ని అందించగలిగే ఒక మనీ బ్యాక్ ప్లాన్.
2. అర్హత : పెట్టుబడిదారుడి వయసు 19 నుండి 45 ఏళ్ళు మధ్య కలిగి ఉండాలి.
– కాలానికి అనుకూలంగా రాబడి మరియు సురక్షితమైన పెట్టుబడి కోసం చూస్తున్నటువంటి గ్రామీణ పెట్టుబడిదారులకు ఈ పథకం అనేది ప్రత్యేకంగా సరిపోతుంది.
– రోజువారి మొత్తాన్ని కూడా వీరు డిపాజిట్ చేయటం వలన రూ.95, పెట్టుబడి పెట్టే దారుడు సుమారుగా మెచ్యూరిటీ టైమ్ లో 14 లక్షల పొందవచ్చు.
– 15 ఏళ్ళు మరియు 20 ఏళ్ళు నిబంధనలకు అందుబాటులో ఉంటుంది.
– 1995లో మొదలు పెట్టిన ఈ పథకం అనేది దాదాపు మూడు దశాబ్దాలుగా నమ్మకమైన రాబడి మరియు భద్రతను అందిస్తూ ఉంది.
మనుగడ ప్రయోజనాలు :
– పాలసీ యొక్క మెచ్యూరిటీ వరకు పాలసీదారుడు జీవించి ఉన్నట్లయితే, వారు కాలానికి అనుకూలంగా రాబడి అందుకోవచ్చు.
– 15 ఏళ్ళు పాలసీ కోసం పెట్టుబడిదారుడు 6, 9 మరియు 12 ఏళ్ళు తర్వాత హామీ మొత్తంలో 20% వరకు మీరు మెచ్యూరిటీ టైమ్ లో బోనస్ తో పాటు మిగిలిన 40% కూడా పొందుతారు.
• 20 ఏళ్ళు పాలసీ కోసం పెట్టుబడి పెట్టే వారు 8,12మరియు మరియు 16 ఏళ్ళు తర్వాత ఆమె మొత్తంలో 20% మరియు మెచ్యూరిటీ టైంలో బోనస్ తో పాటుగా మిగిలిన 40% కూడా మీరు అందుకోవచ్చు.
మరణ ప్రయోజనాలు :
– ఒకవేళ పాలసీదారు మరణించిన సందర్భంలో నామీని కి వచ్చిన బోనస్ తో పాటుగా మొత్తాన్ని కూడా మీరు అందుకుంటారు.
రిటర్న్స్ యొక్క ఉదాహరణ :
– పెట్టుబడి మొత్తం : రూ. 20 ఏళ్ళు కు 7 లక్షలు.
– రోజువారి డిపాజిట్ : రూ.95
– నెలవారి డిపాజిట్ : రూ.2,853.
– త్రేమాసిక డిపాజిట్ : రూ.8,850.
– సెమీ వార్షిక డిపాజిట్ : రూ.17,100.
– మెచ్యూరిటీ టైంలో రాబడి : సుమారుగా రూ.14 లక్షలు ఉంటుంది.
పథకం అనేది ఎలా పని చేస్తుంది :
1.దరఖాస్తు ప్రక్రియ :
– ఈ పథకం కోసం దరఖాస్తు చేసేందుకు పెట్టుబడి పెట్టేవారు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ ను సంప్రదించాలి.
– అవసరమైన ఫారమ్ లను కూడా పూరించాలి. అంతేకాక మీ గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు లాంటి అవసరమైన పత్రాలను కూడా సమర్పించాలి.
1. ప్రీమియం చెల్లింపు :
– పెట్టుబడిదారుడు స్థిరమైన మొత్తాన్ని కూడా క్రమం తప్పకుండా డిపాజిట్ చేస్తారు. ఇది రోజుకు రూ.95
– పెట్టుబడిదారుడు సౌలభ్యం ప్రకారం చెల్లింపులు అనేవి నెలవారి, త్రైమాసికం లేక సెమీ వార్షికంగా కూడా చేసుకోవచ్చు.
మెచ్యూరిటీ మరియు ఆవర్తన రాబడి :
-15 ఏళ్ళు కాల వ్యవధికి : 6,9 మరియు 12 ఏళ్ళు తర్వాత పెట్టుబడిదారుడు ప్రతిసారి కూడా హామీ మొత్తంలో 20% వరకు పొందుతాడు. మరియు మెచ్యూరిటీ టైంలో కూడా వారు బోనస్ తో పాటుగా మిగిలిన 40% కూడా పొందుతారు.
* 20 ఏళ్ళు కాలవ్యవధికి : 8,12 మరియు 16 ఏళ్ళు తరువాత పెట్టుబడిదారుడు ప్రతిసారి కూడా హామీ మొత్తంలో 20% పొందగా మెచ్యూరిటీ టైములో కూడా వారు బోనస్ తో పాటుగా మిగిలిన 40% కూడా పొందుతారు.
మరణ దావా :
మెచ్యూరిటీ కి ముందు పాలసీదారు మరణించిన పక్షంలో నామీని పూర్తిగా హామీ మొత్తం తో పాటుగా సంచిత బోనస్ కూడా అందుతుంది.
పథకం యొక్క ప్రయోజనాలు :
– ఫైనాన్షియల్ సెక్యూరిటీ : మెచ్యూరిటీ టైంలో గణనీయమైన మొత్తంతో పాటు గణనీయమైన ఆర్థిక భద్రతను కూడా అందిస్తుంది.
– ఆవర్తన రాబడి : మీ పాలసీ వ్యవధిలో లిక్విడిటీని నిర్ధారిస్తూ, కాలానికి అనుకూలంగా రాబడి అనేది అందిస్తుంది.
– జీవిత బీమా కవర్ : పాలసీదారుకు అకాల మరణం గనక వచ్చినట్లయితే అప్పుడు కుటుంబ భవిష్యత్తుకు భద్రత కల్పిస్తూ జీవిత బీమా అనేది రక్షణను ఇస్తుంది.
– రూరల్ ఫోకస్ : గ్రామీణ పెట్టుబడిదారుల అవసరాలను కూడా తీర్చేందుకు ప్రత్యేకంగా తయారు చేయబడింది.
గ్రామ సుమంగళ్ గ్రామీణ డాక్ జీవన బీమా యోజన అనేది ఎంతో ఉపయోగకరమైన పథకం. ఈ పథకం గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే. తమ కుటుంబాలు ఆర్థిక భవిష్యత్తులో కాలానికి అనుకూలంగా రాబడి మరియు మెచ్యూరిటీ టైమ్ లో గణనీయమైన మొత్తంలో పొందే లక్ష్యంతో ఉన్నాయి. ఆసక్తి గల వ్యక్తులు ఎవరైనా సరే దీని గురించిన మరిన్ని వివరాలను పొందేందుకు మరియు ఈ ఉపయోగమైన పథకంలో నమోదు చేసుకునేందుకు మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లో సంప్రదించండి…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.