Phonepe : ఉద్యోగస్తులకు ఫోన్ పే ద్వారా రూ.5 లక్షల లోన్... ఎలా పొందాలంటే...!
Phonepe : ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా…?డబ్బు కోసం ఎదురు చూస్తున్నారా..?ఇలాంటి సమయంలో స్నేహితులు బంధువుల నుండి కూడా సాయం అందకపోతే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ఇంటి నుండే సౌకర్యంగా ఆన్ లైన్ లో సులభంగా లోన్ పొందవచ్చు. ఈ విధంగా ఆన్లైన్లో దాదాపు 5 లక్షల వరకు మీరు రుణం పొందవచ్చు. మరి ఈ పర్సనల్ లోన్ ఎలా పొందాలి..?దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం ఆన్ లైన్ సేవలు విపరీతంగా నడుస్తున్నాయి. ఫోన్ పే ,గూగుల్ పే , పేటియం అంటూ పలు రకాల ఆన్ లైన్ యాప్ లను ఉపయోగించి నగదు చెల్లింపులు జరుపుతున్నారు. అయితే దీనిలో ప్రముఖ డిజిటల్ చెల్లింపు కంపెనీలలో ఒకటైనటువంటి ఫోన్ పే ద్వారా మీరు వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం కచ్చితంగా గమనించాలి. ఇక్కడ మీకు ఫోన్ పే రుణాలను అందించదు. ఇది ఒక థర్డ్ పార్టీ ఫైనాన్స్ ప్లాట్ ఫామ్ ల ద్వారా మీకు రుణ సదుపాయం అందిస్తుంది.
అంటే మీరు ఫోన్ పే లో ఉండేటువంటి ఫైనాన్స్ కంపెనీ ఆప్షన్ పై క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీరు ఫైనాన్స్ కంపెనీ ప్లాట్ ఫోర్మ్ లోకి వెళ్తారు. ఇక్కడ మీరు పొందాల్సిన రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే ఫోన్ పే అనేది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఉంది. దీంతో ఫోన్ పే లో ఎన్నో రకాల కంపెనీలు కనిపిస్తుంటాయి. అయితే మీరు ఈ లోన్ పొందాలంటే ముందుగా మీరు ఫోన్ పే యాప్ కి వెళ్ళాలి. ఇక్కడ మీకు స్పాన్సర్ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత పూనావాలా పర్సనల్ లోన్ ,L&T ,పర్సనల్ లోన్ ,షేర్ మార్కెట్ , టాటా న్యూ పర్సనల్ లోన్ మొదలైన మీకు కనిపిస్తాయి.
Phonepe : ఉద్యోగస్తులకు ఫోన్ పే ద్వారా రూ.5 లక్షల లోన్… ఎలా పొందాలంటే…!
వీటిలో మీరు పూనావాలా పర్సనల్ లోన్ అప్లై చేసుకోవాలి. దీని ద్వారా ఉద్యోగస్తులు సులభంగా రూ.5 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. కానీ ఈ లోన్ పొందాలంటే ఆ వ్యక్తి యొక్క ఆర్థిక ఆదాయం 3 లక్షలకు మించి ఉండాలి. అలాగే దీనిలో సున్న ప్రీ పేమెంట్ చార్జీల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ ను నమోదు చేసి ఓటిపి పొందడం ద్వారా ఈ లోన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన ప్రతి ఒక్కరు సులభంగా రుణాలను పొందవచ్చు. మంచి సిబిల్ స్కోర్ కలిగి ఉన్నవారు ఈ లోను త్వరగా పొందగలుగుతారు.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.