Home » Business » Gold Rate Today May 12th 2025
Business

Today Gold Price : బంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్..ఈరోజు భారీగా తగ్గిన బంగారం ధర

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: May 12, 2025 5:53 pm
Advertisement

Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు సోమవారం (మే 12) న బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,670గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,440గా నమోదైంది. అంతేకాకుండా కేజీ వెండి ధర రూ. 1,10,900 గా ఉంది. బంగారం ధరలు తగ్గడానికి కారణం అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా అమెరికా-చైనా మధ్య చర్చలు నడుస్తున్నాయి.

Advertisement

దీంతో స్టాక్ మార్కెట్లలో కూడా పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది. వీటి కారణంగా బంగారం ధర తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిణామాలు బంగారం ధరల తగ్గుదలకు మరో కారణంగా చెప్పవచ్చు. అమెరికా-చైనా మధ్య వ్యాపార సంబంధాలు పట్ల చర్చలు జరుగుతుండడం , అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకు పాజిటివ్ ఒప్పందాలను సూచిస్తుంది. తద్వారా డాలర్ ధర బలపడింది. స్టాక్ మార్కెట్లు లాభాలతో ఓపెన్ అవుతున్నాయి.

Today Gold Price : బంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్..ఈరోజు భారీగా తగ్గిన బంగారం ధర

Advertisement

ఈ పరిస్థితులు బంగారం ధరలు తగ్గే అవకాశాన్ని పెంచుతున్నాయి. బంగారం ధరలు తగ్గడం వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే ధరలు తగ్గడం వల్ల, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ వైపు తరలించే అవకాశం ఉంది. ఈ కారణంగా బంగారం ధరలు తగ్గిపోతే, దేశీయ మార్కెట్లలో కూడా బంగారు ఆభరణాల ధరలు తగ్గనున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కూడా ఉన్న నేపథ్యంలో పసిడి ప్రియులకు కొంత ఊరట లభించవచ్చు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి