Gold Rate Today : గోల్డ్ డౌన్.. సిల్వర్ అప్.. ఈ రోజు 22K, 24K ధరలు ఎంతంటే?
Gold Rate Today: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24K, 22K గోల్డ్ రేట్లు, కిలో వెండి తాజా ధరలు, MCX మార్కెట్ వివరాలు ఇవిగో.
Gold Rate Today : అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న పరిస్థితులు, డాలర్ ఇండెక్స్‌లో చోటుచేసుకుంటున్న మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి వంటి అంశాలు దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో రోజురోజుకూ మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లపై వినియోగదారులు ఆసక్తిగా గమనిస్తున్నారు. గత వారం వరుసగా పెరుగుతూ దూసుకెళ్లిన బంగారం ధరలకు సోమవారం స్వల్పంగా బ్రేక్ పడింది. గత వారం బంగారం ధర తులంపై ఏకంగా రూ.7లకు పైగా పెరిగినప్పటికీ.. సోమవారం మాత్రం ధరలు కొంత తగ్గాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం అందుకు భిన్నంగా భారీగా పెరిగాయి. ఎంసీఎక్స్ మార్కెట్‌లోనే కాకుండా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం తగ్గగా.. వెండి ధర పైకి ఎగబాకింది. అయితే ఈ ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఎంసీఎక్స్ ఫ్యూచర్స్‌తో పాటు హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Gold Rate Today : గోల్డ్ డౌన్.. సిల్వర్ అప్.. ఈ రోజు 22K, 24K ధరలు ఎంతంటే?
Gold Rate Today MCXలో బంగారం తగ్గింది.. వెండి ధర మాత్రం పెరిగింది
ఉదయం 9:03 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ ధర మాత్రం పెరిగింది. ప్రస్తుతం ఆగస్టు 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,51,550 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.270 తగ్గుదల కావడం గమనార్హం. ఇక వెండి విషయానికి వస్తే ధర పెరిగింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,32,035 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌తో పోల్చితే కిలో వెండిపై రూ.569 పెరుగుదల నమోదైంది. అంటే ఫ్యూచర్స్ మార్కెట్‌లో సోమవారం ఉదయం బంగారం స్వల్పంగా వెనక్కి తగ్గగా.. వెండి మాత్రం లాభాల బాట పట్టింది. ఈ మార్పులు బులియన్ మార్కెట్‌ను గమనిస్తున్న పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Gold Rate Today హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు
ఫ్యూచర్స్ మార్కెట్‌లో మాత్రమే కాకుండా స్పాట్ మార్కెట్‌లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. బంగారం ధర తగ్గగా.. వెండి ధర పెరిగింది. ఉదయం 9:07 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు గత ముగింపు ధరతో పోలిస్తే రూ.430 తగ్గింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,730 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,086గా ఉంది.
ఇక వెండి ధర మాత్రం బంగారానికి పూర్తి భిన్నంగా కదిలింది. గత మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కిలో వెండిపై రూ.370 పెరుగుదల నమోదైంది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,33,030 వద్ద కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే సోమవారం ఉదయం బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించగా.. వెండి మాత్రం వరుసగా లాభాల దిశగా కదిలింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్ కదలికలు, పెట్టుబడిదారుల ఆసక్తి వంటి అంశాల ఆధారంగా రానున్న రోజుల్లోనూ గోల్డ్, సిల్వర్ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలనుకునేవారు తాజా మార్కెట్ ధరలను పరిశీలించడం మంచిది.







