Home » Business » Successful Farmer Shiv Story
Business

Successful Farmer : మేనేజర్ నుండి రైతుగా మారి .. వ్యవసాయంలో నెలకు 15 లక్షల నికర లాభం సాధించిన శివు .. ఎలాగో తెలుసా ..!

Authored By
Suma
The Telugu News | Published on: March 3, 2026, 3:00 pm
Advertisement

Successful Farmer : చాలా మంది యువత ఉద్యోగాల కోసం మహానగరాల వైపు పరుగులు తీస్తుంటారు. స్థిరమైన జీతం, సౌకర్యవంతమైన జీవితం, కార్పొరేట్ సంస్కృతి ఇవన్నీ వారిని ఆకర్షిస్తాయి. కానీ కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాకు చెందిన 30 ఏళ్ల శివు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. అతను బెంగళూరులోని ఒక ప్రైవేట్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తూ నెలకు రూ.50 వేల జీతం అందుకుంటున్నాడు. సంవత్సరానికి సుమారు రూ.6 లక్షల ఆదాయం ఉన్నప్పటికీ, కరోనా కాలంలో నగర జీవనశైలి పట్ల విరక్తి కలిగింది. తన మూలాలకు చేరుకోవాలనే ఆలోచనతో శివు స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తనకు వారసత్వంగా ఉన్న 5 ఎకరాల భూమిని ఉపయోగించి వ్యవసాయంలో ఏదైనా కొత్తగా చేయాలనే సంకల్పం తీసుకున్నాడు. సుమారు రూ.5 లక్షల పెట్టుబడితో శాస్త్రీయ పద్ధతుల్లో సాగు ప్రారంభించాడు. స్థిరమైన ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయాన్ని ఎంచుకోవడం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించినా, శివు తన నిర్ణయంపై పూర్తి విశ్వాసంతో ముందుకు సాగాడు.

Advertisement

Successful Farmer : మేనేజర్ నుండి రైతుగా మారి .. వ్యవసాయంలో నెలకు 15 లక్షల నికర లాభం సాధించిన శివు .. ఎలాగో తెలుసా ..!

Successful Farmer : మిశ్రమ పంటలతో విజయం సాధించిన మార్గం

వ్యవసాయం అంటే కేవలం ఒకే పంటపై ఆధారపడటం కాదని శివు నమ్మాడు. అందుకే మిశ్రమ పంటల విధానాన్ని ఎంచుకున్నాడు. తన అయిదెకరాల్లో పొగాకు, పుచ్చకాయ, రాగులు, వరి, బఠానీలు, మినుములు, పెసలు వంటి పంటలను సాగు చేయడం ప్రారంభించాడు. మొదట్లో పొగాకుపై ఎక్కువ దృష్టి పెట్టినప్పటికీ, తరువాత ఆహార ధాన్యాలు మరియు పోషక విలువలున్న తృణ ధాన్యాలపై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. బయో ఎరువుల వినియోగం, సేంద్రియ విధానాలు, నీటి సమర్థవంతమైన వినియోగం వంటి శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం వల్ల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఒకే పంట విఫలమైనా, ఇతర పంటల ద్వారా నష్టాన్ని పూడ్చుకునే విధంగా వ్యవస్థను రూపొందించాడు. గత ఐదేళ్లుగా ఈ విధానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఆయన లెక్కల ప్రకారం పుచ్చకాయతో సుమారు రూ.3 లక్షలు, పొగాకుతో రూ.4 లక్షలు, రాగులతో రూ.2 లక్షలు, వరితో రూ.1 లక్ష, ఇతర పంటలతో రూ.5 లక్షల వరకు లాభం వస్తోంది. మొత్తం ఖర్చులు తీసివేసిన తర్వాత సంవత్సరానికి సుమారు రూ.15 లక్షల నికర లాభాన్ని పొందుతున్నాడు. ఇది అతను మేనేజర్‌గా పనిచేసినప్పుడు సంపాదించిన దానికంటే రెండింతలు ఎక్కువ.

Advertisement

Successful Farmer : నేరుగా విక్రయాలు … మధ్యవర్తులపై చెక్

శివు విజయానికి కారణం కేవలం సాగు పద్ధతులే కాదు, మార్కెటింగ్ వ్యూహాలు కూడా. పంటను నేరుగా సమీప పట్టణాలు, నగరాలకు రవాణా చేసి వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. దీంతో మధ్యవర్తుల పాత్ర పూర్తిగా తగ్గిపోయింది. రైతుకు దక్కాల్సిన పూర్తి లాభం తనకే అందుతోంది. వ్యవసాయాన్ని ఒక వ్యాపారంలా చూడాలి అని శివు నమ్మకం. మార్కెట్ అవసరాలను అర్థం చేసుకుని పంటల ఎంపిక చేయడం, వ్యయ నియంత్రణ, నాణ్యతపై దృష్టి పెట్టడం వంటి అంశాలు అతనికి లాభాలను తెచ్చిపెట్టాయి. ఆధునిక ఆలోచనలతో వ్యవసాయం చేస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కంటే ఎక్కువ సంపాదించవచ్చని ఆయన తన విజయంతో నిరూపించాడు. ఇప్పుడు శివు కథ యువతకు స్ఫూర్తిదాయకంగా మారింది. స్థిరమైన ఉద్యోగాన్ని వదిలి, మట్టిని నమ్ముకొని ముందడుగు వేసిన అతను కృషి, పట్టుదల, శాస్త్రీయ దృక్పథం ఉంటే వ్యవసాయంలో కూడా బంగారు భవిష్యత్తు సాధ్యమేనని చూపించాడు.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి