Today Gold Price : హమ్మయ్య ఈరోజు దిగొచ్చిన బంగారం ధర.. తులం ఎంత ఉందంటే..!!
Today Gold Price : గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు ప్రతిరోజూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ. 1,03,000కి చేరింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలంటే సాధారణ ప్రజలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు. అయితే ఈరోజు మాత్రం కాస్త తగ్గుదల కనిపించింది. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 600 తగ్గి రూ. 1,00,480గా నమోదైంది. అదే విధంగా 22 క్యారెట్ల ధర రూ. 550 తగ్గి రూ. 92,100గా ఉంది. వెండి ధర కూడా కేజీకి రూ. 2,000 తగ్గి రూ. 1,20,000గా నమోదైంది. ఈ ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సగటున ఇలా ఉన్నట్లు తెలుస్తోంది.
Today Gold Price : హమ్మయ్య ఈరోజు దిగొచ్చిన బంగారం ధర.. తులం ఎంత ఉందంటే..!!
బంగారం ధరల ఈ తీవ్ర పెరుగుదల మధ్య పసిడి ఆభరణాలు కొనడం తక్కువ ఆదాయ గలవారికి దాదాపు అసాధ్యంగా మారింది. గతేడాది ఇదే జూన్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,000 మాత్రమే ఉండగా, ఇప్పుడు దాదాపు రూ. 28,000 పెరిగింది. ఇది శాతం ప్రకారం చూస్తే 35-40 శాతానికి పైగా పెరుగుదలగా చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహ కాలంలో బంగారానికి ఉండే డిమాండ్ నేపథ్యంలో గోల్డ్ జ్యువెలరీ కొనుగోళ్లపై చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. మార్కెట్‌లో ధరల పెరుగుదల కారణంగా గోల్డ్ లోన్స్, గోల్డ్ బాండ్‌లపై ప్రజల ఆసక్తి మాత్రం పెరుగుతున్నదిగా వ్యాపారవేత్తలు చెబుతున్నారు.
గత ఐదు సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే బంగారం ధరలు మూడు రెట్లు పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 2020లో 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 40,000 వద్ద ఉండగా, ప్రస్తుతం అది లక్ష రూపాయల మార్క్ దాటింది. ఇది ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఇన్ఫ్లేషన్, డాలర్ వ్యాల్యూ, జియోపాలిటికల్ సమస్యలు వంటి అనేక కారణాల వల్ల చోటుచేసుకున్నదిగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. భవిష్యత్‌లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, దీనికి ముందు నుంచి సన్నద్ధం కావాలంటున్నారు. దీంతోపాటు, బంగారం కొనుగోళ్లలో సురక్షిత మార్గాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.