BYJUS Company : లక్షల కోట్లకు ఎగిసిపడిన ‘ బైజూస్ ‘ స్టార్టప్ ఇప్పుడెందుకు అప్పుల్లో కూరుకుపోయింది…?

Advertisement
Advertisement

BYJUS Company : ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టార్టప్ లలో ఒకటి ‘ బైజూస్ ‘. బైజు రవీంద్రన్ స్థాపించిన ఈ కంపెనీ 2018లో యూనికార్న్ సంస్థల లిస్టులో చేరింది. కరోనా వైరస్ సంక్షోభంలో స్కూళ్లు మూతపడడంతో బైజూస్ విపరీతంగా పెట్టుబడులను ఆకర్షించి తన వ్యాపారాలను భారీగా విస్తరించింది. కానీ ఆ తర్వాత దెబ్బ మీద దెబ్బలతో కంపెనీ ఒక్కసారిగా చతికిలపడింది. 2018 నాటికి 1.5 కోట్ల మంది సబ్స్క్రైబర్లతో బైజూస్ యూనికార్న్ ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ గల సంస్థలుగా చరిత్ర సృష్టించింది. అయితే 2021లో 327 మిలియన్ల డాలర్లు నష్టాన్ని ఈ సంస్థ చూసింది. అంతకుముందు ఏడాది కంటే ఇది 17 రేట్లు ఎక్కువ. అప్పటినుంచి వరుసగా వైఫల్యాలను మూట కట్టుకుంటూ వస్తుంది. ఒకప్పుడు 1.82 లక్షల కోట్లు ( 22 బిలియన్ డాలర్లు) గా ఉన్న కంపెనీ విలువను ఇటీవల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్ రాక్ ఒక బిలియన్ డాలర్లకు సుమారుగా 8266 కోట్లకు తగ్గించేసింది.

Advertisement

BYJUS Company : సీఈఓ గా రవీంద్రన్ బైజు తొలగింపు

గత నెల 23న బైజూస్ పేరెంట్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ నిర్వహించిన ఈజీఎంలో మెజారిటీ వాటాదారులు రవీంద్రన్ ను సీఈఓ పదవి నుంచి తొలగించాలని ఓటు వేశారు. నిర్వహణ లోపం, వైఫల్యాల ఆరోపణలపై అతనిని తొలగిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను రవీంద్రన్ ఆయన ఫ్యామిలీ కొట్టు పారేసింది. అంతర్గత కంపెనీ చట్టాలను ఈ సమావేశం ఉల్లంఘించిందని కనీసం ఒక వ్యవస్థాపక డైరెక్టర్ ఏజీఎంలో ఉండాలని చెప్పింది. ఆ తర్వాత ఉద్యోగులకు రాసిన లేఖలో ఈ సమావేశం హాస్యాస్పదంగా ఉందని దీన్ని కోర్టులో సవాల్ చేయనున్నట్లు పేర్కొంది.

Advertisement

BYJUS Company : రోడ్డున పడ్డ ఉద్యోగులు

ఈ కేసు విచారణలో ఉన్న క్రమంలో ఈజీఎంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి తాత్కాలికంగా కర్ణాటక హైకోర్టు నిలిపివేసింది. ఇటీవల ఈ ఎడ్ టెక్ కంపెనీకి న్యాయ ఆర్థికపరమైన సవాళ్లు పెద్ద ఎత్తున పెరిగాయి. గతేడాది కాలంలోనే కంపెనీ అప్పుల కుప్పలుగా పేరుకుపోయింది. కంపెనీ ఇన్వెస్టర్లు సైతం అసంతృప్తిగా ఉన్నారు. అప్పులు ఇచ్చినవారు కోర్టులో దావాలు వేశారు. దేశ ఆర్థిక నేరాల విభాగం సైతం ఈ కంపెనీ కార్యకలాపాలపై విచారణ చేపట్టింది. వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వేతనాలు ఆలస్యం అవుతున్నాయి. నగదు సంక్షోభం కంపెనీని వెంటాడుతుంది. గడువులు ముగిసిన తర్వాత జనవరిలో రిపోర్ట్ చేసిన 2022 సంవత్సరానికి చెందిన ఆర్థిక ఫలితాల్లో థింక్ అండ్ లెర్న్ కంపెనీకి 8230 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ నష్టం వచ్చినట్లు ప్రకటించింది. 2023 కి చెందిన ఆడిటెడ్ ఫలితాలను డిసెంబర్ చివరి గడువును ఇది మిస్సైంది. బైజూస్ పై కస్టమర్లు సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. వారు భరించలేని కోర్సులను కొనుగోలు చేయాలని కంపెనీ తమపై ఒత్తిడి తెచ్చిందని తెలిపారు. సోషల్ మీడియాలో సైతం కంపెనీపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవి, దురుద్దేశంతో చేసినవని కంపెనీ కొట్టి పారేస్తుంది. రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులు యాక్సిస్ లేకపోవడంతో వేతనాలు ఇవ్వడం ఆలస్యం అవుతున్నట్లు బైజూస్ తన ఉద్యోగులకు తెలిపింది. నెల క్రితం కూడా డబ్బులు లేకపోవడంతో వేతనాలు చెల్లించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కంపెనీ తెలిపింది.

BYJUS Company : అతిపెద్ద టీచింగ్ కంపెనీ

2011లో బైజూస్ ను బైజు రవీంద్రన్ ప్రారంభించారు. దీనికి ఫేస్ బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ ఆధ్వర్యంలో నడిచే జాన్ జూకర్ బర్గ్, టైగర్ గ్లోబల్ అండ్ జనరల్ అట్లాంటిక్ లాంటి సంస్థలు ప్రధాన ఫండింగ్ కంపెనీలు. మొదటగా ఈ కంపెనీ భారత్లో స్కూల్ విద్యార్థులకు, పోటీ పరీక్షలకు క్లాసులు చెప్పడంపై దృష్టి పెట్టింది. ఆ తర్వాత పలు భారతీయ భాషల్లో లెర్నింగ్ యాప్స్ ను ప్రవేశపెట్టింది. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడడంతో భారత్ లో అనేక మంది విద్యార్థులు బైజూస్ లాంటి ఆన్లైన్ క్లాసుల వైపు మొగ్గు చూపారు. దీంతో ఆ సంస్థకు వరంగా మారింది. కరోనా రాకతో కంపెనీ విలువ రాకెట్ల దూసుకుపోయింది. వైట్ హ్యాట్ జూనియర్, ఆకాష్ , ఎపిక్, గ్రేట్ లెర్నింగ్ లాంటి స్టార్టప్ లను వరుసగా సంస్థ తనలో కలుపుకుంది. దీనికోసం రెండు బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. డజన్ల సంఖ్యలో పోటీదారులు ఉన్నప్పటికీ కోడింగ్ క్లాసుల నుండి పోటీ పరీక్షల కోచింగ్ వరకు ప్రతి కోర్సులు అందించే ఒక అతిపెద్ద ఆన్లైన్ టీచింగ్ కంపెనీగా బైజుస్ ఎదిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఇండియన్ టీవీ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించే బ్రాండ్ గా కంపెనీ నిలబడింది.

BYJUS Company : లక్షల కోట్లకు ఎగిసిపడిన ‘ బైజూస్ ‘ స్టార్టప్ ఇప్పుడెందుకు అప్పుల్లో కూరుకుపోయింది…?

200 మిలియన్ డాలర్లను సేకరించి నగదు కొరతను పరిష్కరించుకునేందుకు కంపెనీ ప్రతిపాదించిన రైట్స్ ఇష్యూ వల్ల బైజూస్ తన ఇన్వెస్టర్ల మధ్య ప్రస్తుతం ప్రతిస్తంభన నెలకొంది. కంపెనీలో అదనంగా కొత్త షేర్లను కొనుగోలు చేయాలని ప్రస్తుత షేర్ హోల్డర్లకు కంపెనీ ఆహ్వానం పంపింది. రైట్ ఇష్యూ పూర్తిగా సబ్స్క్రయిబ్ అయిందని ఈజీఎం ముందు రవీంద్రన్ చెప్పారు. ఈ నిధులు ఎలా వాడుతున్నామో పర్యవేక్షించేందుకు థర్డ్ పార్టీ ఏజెన్సీని నియమించాలనుకుంటున్నట్లు కూడా తెలిపారు. కానీ కంపెనీ విలువ ఒక్కసారిగా తగ్గిపోయింది. రైట్ ఇష్యూ అడ్డుకోవాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ వద్ద నలుగురు బైజూస్ ఇన్వెస్టర్లు తమ పిటిషన్ను దాఖలు చేశారు. పిటిషన్ను పరిష్కరించే అంతవరకు ప్రత్యేక అకౌంట్లో ద్వారా సేకరించిన ఫండ్స్ ను ఉంచాలని ఆదేశించింది. 9300 కోట్లు లావాదేవీల విషయంలో విదేశీ మారకపు నిబంధనలను బైజూస్ ఉల్లంఘించినందున ఆరోపణలతో రవీంద్రన్ కు భారత ఆర్థిక నేరాల ఏజెన్సీ ఫిబ్రవరి 22న లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. ఇక ఈడీ విచారణ ముగిసింది అని బైజుస్ తెలిపింది.

BYJUS Company : అతి పెద్ద సవాల్ ఇది

నిధులు సేకరించడమే కంపెనీ ముందున్న అతి పెద్ద సవాల్ అని ఇండిపెండెంట్ కార్పొరేట్ గవర్నెన్స్ రీసెర్చ్ అడ్వైజర్ సంస్థ అధినేత శ్రీరామ్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఆర్థిక నివేదికలను సమర్పించడం బైజూస్ ఆలస్యం చేస్తుందని చెబుతూ ఆడిటర్ బాధ్యతల నుంచి డెయిలాట్ హస్కిన్సి సెల్స్ లిప్ సంస్థలు తప్పుకున్నాయి. ఆ రెండు సంస్థలు కంపెనీ రికార్డులను పరిశీలించడం కష్టమవుతుందని చెప్పాయి. ఆ వార్తలో నడుమ బోర్డు సభ్యులు ముగ్గురు పిక్ ఎక్స్వి పార్టనర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వి. రవిశంకర్ , చాన్ జుకర్ బర్గ్, ఇనిషియేటివ్ కు చెందిన వివియాన్ ప్రాసెస్ కు చెందిన రసూల్ డ్రెయిన్ స్టాక్ గతేడాది కంపెనీ బోర్డుకు రాజీనామా చేశారు. దీంతో బై జూస్ సీఈవో బైజు రవీంద్రన్ ఆయన భార్య దివ్య గోకుల్ నాథ్, సోదరుడు రిజు రవీంద్రన్ లు మాత్రమే బోర్డులో మిగిలారు. కంపెనీలు ఫెయిల్ కావడం త్వరగా దెబ్బ తినడం కొన్నిసార్లు వాటికి మంచిదేనని సుబ్రహ్మణ్యన్ అన్నారు. విలువల కోసం పరుగులు పెట్టకుండా మంచి వ్యాపార విధానాలను కంపెనీలు అనుసరించాలని తెలిపారు నిధులు సేకరించడం కొన్ని రోజులకే వాల్యుయేషన్కు వెళ్లడం సరైన విధానం కాదని అన్నారు. ఇప్పుడు అతిపెద్ద భారత స్టార్టప్ పేరున్న బైజూస్ పరిస్థితి ఇది.

Advertisement

Recent Posts

Vijay Karthik – Keerthi Bhat : డబ్బులేవని వదిలేసింది ఛీ .. కీర్తి భట్ ex చెప్పిన దారుణాలు

Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…

12 minutes ago

KCR : బిగ్ బ్రేకింగ్.. ఫోన్ ట్యాపింగ్ లో మరో సంచలనం..కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్

KCR  : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…

57 minutes ago

Loan Against Mutual Funds : డబ్బు అర్జెంట్‌గా కావాలా? మ్యూచువల్ ఫండ్స్‌పై తక్కువ వడ్డీకే లోన్.. పూర్తి వివరాలు ఇవే!

Against Mutual Funds : నేటి డిజిటల్ యుగంలో లోన్ తీసుకోవడం చాలా సులభమైపోయింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్…

1 hour ago

BB JODI Season 2 Promo 1 : రీతూ చౌదరి వాక్ అవుట్ .. శ్రీజ ని చూడగానే

BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…

2 hours ago

Anil Ambani : అనిల్ అంబానీకి గట్టి ఎదురుదెబ్బ…వేల కోట్ల ఆస్తులు ఫసక్

ED Tightens Noose on Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ (ADAG) గ్రూప్ అధినేత అనిల్…

3 hours ago

Rythu Bharosa : గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా నిధులపై ప్రభుత్వం కీల‌క అప్డేట్‌..!

Rythu Bharosa : Telangana రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి…

4 hours ago

Today Gold Price on January 29th 2026 : పసిడి ప్రియులకు మరింత షాక్.. రూ.5000 పెరిగిన పసిడి ధర

Today Gold Price on January 29th 2026 : బంగారం మరియు వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.…

6 hours ago

Brahmamudi Today Episode Jan 29 : బ్రహ్మముడి జనవరి 29 ఎపిసోడ్: నిజం కక్కిన నర్స్.. మంత్రి ఇంటికి దొంగతనంగా రాజ్, కావ్య!

Brahmamudi Today Episode Jan 29 : బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahma Mudi). కావ్య…

6 hours ago