Home » Business » World Most Expensive Wood Agarwood Price Is Higher Than Gold
Business

World’s Most Expensive Wood : బంగారం కూడా దీని ముందు దిగదుడుపే.. కేజీ కోటి పైమాటే.. ఈ చెట్టు ముక్క దొరికితే మీ దశ తిరిగినట్టే..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: February 12, 2026 11:51 am
Advertisement

World’s Most Expensive Wood : బంగారమే ప్రపంచంలో అత్యంత విలువైనది అని మీరు అనుకుంటే పొరపాటే. అంతకు మించిన ఖరీదైన సంపద ప్రకృతిలో దాగి ఉంది. అదే ‘అగర్వుడ్’ Agarwood. దీనిని “లిక్విడ్ గోల్డ్” అని కూడా పిలుస్తుంటారు. సాధారణంగా కనిపించే ఈ చెట్టులో ఏర్పడే ఒక రకమైన జిగురు లేదా కలపకు అంతర్జాతీయ మార్కెట్లో ఊహించని డిమాండ్ ఉంది. ఆగ్నేయాసియా అడవుల్లో పెరిగే ఈ చెట్టు గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

World’s Most Expensive Wood : బంగారం కూడా దీని ముందు దిగదుడుపే.. కేజీ రూ. కోటి పైమాటే.. ఈ చెట్టు ముక్క దొరికితే మీ దశ తిరిగినట్టే!

World’s Most Expensive Wood : బంగారాన్ని మించిన ధర.. కారణం ఇదే!

అక్విలేరియా Aquilaria జాతికి చెందిన ఈ చెట్లు ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి. అయితే, అన్ని చెట్లూ ఇంత ధర పలకవు. ఈ చెట్ల కాండానికి ఏదైనా గాయం అయినప్పుడు లేదా ఒక ప్రత్యేకమైన ఫంగస్ సోకినప్పుడు.. ఆ భాగాన్ని రక్షించుకోవడానికి చెట్టు ఒక రకమైన సుగంధభరితమైన జిగురును Resin విడుదల చేస్తుంది. దీనినే ‘అగర్వుడ్’ అంటారు. మొత్తం చెట్లలో కేవలం 2 నుంచి 7 శాతం చెట్లలో మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది. అది కూడా చెట్టు నాటిన 10 నుంచి 30 ఏళ్ల తర్వాతే ఈ మార్పు సంభవిస్తుంది. అందుకే ఇది అంత అరుదు.

Advertisement

మైండ్ బ్లాక్ చేస్తున్న ‘క్యారా’ రకం రేటు

అగర్వుడ్‌లో అత్యంత నాణ్యమైనదిగా భావించే రకం ‘క్యారా’ Kyara. దీని సువాసన, ఔషధ గుణాల వల్ల దీనికి మార్కెట్‌లో భారీ రేటు ఉంది. ప్రస్తుతం ఈ రకం గ్రాము ధర రూ.8.5 లక్షల వరకు పలుకుతోంది. ఇటీవల షాంఘైలో జరిగిన ఓ వేలంలో కేవలం 2 కేజీల క్యారా రకం కలప ఏకంగా రూ.154 కోట్లకు (22.5 మిలియన్ డాలర్లు) అమ్ముడై సంచలనం సృష్టించింది. దీన్ని బట్టి దీని విలువను మనం అర్థం చేసుకోవచ్చు.

దేనికి ఉపయోగిస్తారు?

ఈ చెట్టు నుండి తీసిన నూనెను “ఊద్” Oud అని పిలుస్తారు. దీనిని ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పెర్ఫ్యూమ్స్ తయారీలో వాడతారు. దీని ఘాటైన, ప్రత్యేకమైన సువాసన ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. ఆయుర్వేదం, చైనా సంప్రదాయ వైద్యంలో నొప్పి నివారణకు, ఒత్తిడిని తగ్గించడానికి దీనిని వాడతారు. మతాచారాల్లో, ధ్యానం చేసే సమయంలో దీనిని ధూపంగా వేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు.

Advertisement

భారత్‌లో ఎక్కడ దొరుకుతుంది?

మన దేశంలో అసోం Assam రాష్ట్రంలో ఈ అక్విలేరియా చెట్లు కనిపిస్తాయి. ఒకప్పుడు ఇవి విరివిగా లభించేవి, కానీ డిమాండ్ పెరగడం, విచక్షణారహితంగా నరకడం వల్ల ఇవి అంతరించిపోతున్న జాతుల జాబితాలోకి చేరాయి. ప్రస్తుతం వీటి సాగుపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి