Home » Business » Xiaomi 17t Pro Launched In The Indian Market
Business

Xiaomi 17T Pro : కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి సూపర్‌ చాన్స్‌ .. షియోమీ 17T ప్రో .. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజులు వాడొచ్చు..

Authored By
Suma
The Telugu News | Updated on: February 10, 2026 4:43 pm
Advertisement

Xiaomi 17T Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్న వారికి ఇది నిజంగా సూపర్ న్యూస్. ప్రముఖ మొబైల్ బ్రాండ్ షావోమీ తన పవర్‌ఫుల్ T సిరీస్‌లో మరో సంచలనాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. టెక్ వర్గాల అంచనాల ప్రకారం వచ్చే మార్చి నెలలో భారత మార్కెట్లో Xiaomi 17T Proను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. గతేడాది విడుదలైన Xiaomi 15T Proకి ఇది అప్గ్రేడ్ వెర్షన్‌గా రానుంది. ముఖ్యంగా చైనాలో మంచి ఆదరణ పొందిన Redmi K90 Ultra మోడల్‌ను రీబ్రాండ్ చేసి ఇండియాలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఫీచర్లు చూస్తే ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లోనే గట్టిపోటీ ఇస్తుందనే చెప్పాలి.

Advertisement

Xiaomi 17T Pro : కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి సూపర్‌ చాన్స్‌ .. షియోమీ 17T ప్రో .. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజులు వాడొచ్చు..

Xiaomi 17T Pro : మూడు స్పీకర్లతో ఆడియోలో కొత్త ట్రెండ్

స్మార్ట్‌ఫోన్‌లలో సాధారణంగా డ్యూయల్ స్పీకర్ సెటప్‌నే చూస్తుంటాం. కానీ Xiaomi 17T Pro ఈ విషయంలో పూర్తిగా కొత్త దారి చూపిస్తోంది. ఈ ఫోన్‌లో ఏకంగా మూడు స్పీకర్లు ఉండడం ప్రధాన ఆకర్షణ. ప్రపంచ ప్రఖ్యాత ఆడియో బ్రాండ్ BOSEతో కలిసి షావోమీ ఈ ప్రత్యేక ఆడియో సెటప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక స్పెషల్ స్పీకర్‌ను ఫోన్ వెనుక భాగంలోని కెమెరా ఐలాండ్‌లో సీక్రెట్‌గా అమర్చారు. దీని వల్ల సినిమాలు చూస్తున్నప్పుడు లేదా పాటలు వింటున్నప్పుడు థియేటర్‌లాంటి అనుభూతి కలుగుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. మ్యూజిక్ లవర్స్ కంటెంట్ స్ట్రీమింగ్ చేసే వారికి ఇది నిజంగా ప్లస్ పాయింట్.

Advertisement

Xiaomi 17T Pro : భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్

పర్ఫార్మెన్స్ విషయంలో కూడా Xiaomi 17T Pro ఎలాంటి రాజీ పడడం లేదు. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. దీంతో హై ఎండ్ గేమింగ్, హెవీ మల్టీటాస్కింగ్ కూడా చాలా స్మూత్‌గా సాగిపోతుంది. ఇక అసలు హైలైట్ ఏంటంటే .. ఇందులో ఏకంగా 8,500mAh భారీ బ్యాటరీని అందిస్తున్నారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రెండు నుంచి మూడు రోజుల వరకు ఛార్జింగ్ అవసరం లేకుండా ఉపయోగించవచ్చని అంచనా. అంతేకాదు ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ ఇవ్వడం వల్ల కొద్ది నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఎక్కువసేపు ఫోన్ వాడే యూజర్లకు ఇది నిజంగా గేమ్ ఛేంజర్.

Xiaomi 17T Pro : ఫీచర్లు, భద్రత, ధరపై అంచనాలు

సెక్యూరిటీ విషయంలో కూడా Xiaomi 17T Pro అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రానుంది. ఇందులో 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ను అందిస్తున్నారు. అలాగే ఫోన్ మన్నిక కోసం IP68, IP69 రేటింగ్స్ ఇచ్చారు. అంటే నీరు, దుమ్ము నుంచి ఫోన్‌కు పూర్తి రక్షణ ఉంటుంది. ధర విషయానికి వస్తే గత మోడల్ Xiaomi 15T Pro ధర సుమారు రూ.77,000గా ఉంది. కొత్త ఫీచర్లు, హార్డ్‌వేర్ అప్గ్రేడ్స్ కారణంగా Xiaomi 17T Pro ధర కొంచెం ఎక్కువగా ఉండొచ్చని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు ధరపై స్పష్టత రానుంది. ఇక ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న వారికి Xiaomi 17T Pro ఒక ఆసక్తికరమైన ఎంపికగా మారనుంది.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి