Rakhi Festival : ఆగస్టు 31 రాఖీ పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారం చేసి తీరాల్సిందే.. మరి రాఖీ పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయాలి. అసలు ఎందుకు పరిహారం చేయాలి. అనే విశేషాలు మనం తెలుసుకుందాం… ఆగస్టు 31 రాఖీ పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు ఒక పరిహారం కచ్చితంగా చేసుకోవాలి. ఎందుకు అంటే రాఖీ పౌర్ణిమ ఈసారి అంటే 2023వ సంవత్సరం భద్ర ముహూర్తంలో వచ్చింది. ఈ ముహూర్తంలో రాఖీ కట్టకూడదు. ఒకవేళ మీరు అలా రాఖీ కడితే అతి పెద్ద గండమైతే కనిపిస్తుంది. ఈ రాఖీ పౌర్ణిమ రక్షాబంధనం అంటే సోదరుడు సోదరి అత్యంత పవిత్రంగా వారి యొక్క బంధం కలకాలం నిలవాలని జరుపుకునేటువంటి పండగ. ఇది అన్నకు చెల్లెలు అండగా ఉండాలని చెల్లెలికి అన్నయ్య తోడుగా జీవితాంతం ప్రమాణం చేసుకునే రాఖీ పండుగను జరుపుకుంటారు.
ఆగస్టు 30వ తారీకు శ్రావణ పౌర్ణమి రాత్రి తొమ్మిది గంటల నుండి ఆగస్టు 31 ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఇది ఆగస్టు 31 ఉదయాన్నే ఉషోదయం కాకముందే చేసుకోవాల్సినటువంటి పరిహారం. తల్లి తన కొడుకుల పేర ఈ పరిహారాన్ని చేయాలి. ముందు రోజు రాత్రి మీరు రావి ఆకులను తెచ్చి పెట్టుకోండి. 11 రావి ఆకులను కింద రాలి పడిపోయి ఉన్నటువంటి రావి ఆకులు ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చి చక్కగా వాటిని పసుపు నీళ్లతో కడిగి పూజ మందిరంలో ఉంచుకోండి. ఆగస్టు 31 సూర్యోదయం కాకముందే స్నానం చేసి ఈ రావి ఆకుల్ని చక్కగా పసుపు కుంకుమతో అలంకరించండి. అలా సిద్ధం చేసుకున్న రావి ఆకుల్ని తొమ్మిది పోచలు వేసినటువంటి దారంతో ముడి వేయాలి.
అయితే ఈ దారాన్ని కొద్దిగా గంధం కలిపినటువంటి నీటిలో తడపాలి. అలా తడిపి పచ్చగా అయినటువంటి ఆ దారాన్ని ఒక్కొక్క రావి ఆకును ముడి వేసుకుంటూ వెళ్ళాలి. అలా 11 రావి ఆకుల్ని కూడా చక్కగా కట్టాలి. ఈ కడుతున్నంతసేపు ముడులు వేస్తున్నంత సేపు మీకు ఎంతమంది కొడుకులైతే ఉన్నారో వారి పేర్లు తలుచుకుంటూ ముడి వేయాలి. ఇలా వేసిన తర్వాత ఆ రావి ఆకుల తోరణాన్ని పూజలో పెట్టి పూజ చేసుకోవాలి. పూజ అయిపోయిన వెంటనే ఆ రావి ఆకుల తోరణాన్ని మీ ఇంటి సింహద్వారం ఏదైతే ఉందో ఆ సింహద్వారానికి కట్టాలి. ఇలా తోరణంలా కట్టుకున్నంత సేపు కూడా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది కొడుకుల పేర్లు తలుచుకుంటూ కట్టాలి. ఆ తర్వాత సాంబ్రాణి ధూపం వేయాలి. ఈ విధంగా కచ్చితంగా చేయాలి.
అయితే ఈ పద్ధతి అంతా కూడా సూర్యోదయం కాకుండా నే చేయాలి. ఇలా చేసినట్లయితే మీ కొడుకులకు ఎటువంటి హాని, ఇబ్బందులు, గండాలు అనేవి రావు… వారి అభివృద్ధికి మీరు బాటలు వేసిన వారు అవుతారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.