Ravi Yoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలలో చంద్రుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రస్తుతం తులా రాశిలో ఉన్న చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా దేవి నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ కుష్మాండ అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఇక దీంతో నేడు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన రవి యోగం కూడా నేడు ఏర్పడబోతుంది.
రవి యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి. అయితే ఈ యోగం సూర్యుడి నక్షత్రం నుండి చంద్రుని నక్షత్రం 4వ 6వ 9వ 10వ 13వ మరియు 20వ స్థానాలలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో వీరికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మన వివరంగా తెలుసుకుందాం…
వృషభ రాశి వారికి రవి యోగం కారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే వీరు ఊహించనిరీతిలో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఈ సమయంలో వీరి ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. రవి యోగం కారణంగా వృషభ రాశి వారు భాగ్యస్వామ్య వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. వృషభ రాశి జాతకులు పిల్లలతో సమయాన్ని ఎక్కువగా గడుపుతారు. ఈ సమయంలో వీరు స్నేహితులతోనూ బంధువులతోనూ బంధం బలపడుతుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సమయంలో అడ్డంకులన్నీ తొలిగి సంతోషంగా గడుపుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు రవి యోగం కారణంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. అలాగే ఈ సమయంలో వీరికి ఆకస్మితక ధన లాభం ఉంటుంది. ఏ పని చేసిన అందులో విజయాలను సాధిస్తారు. కర్కాటక రాశి వారికి రవి యోగం కారణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కలిగిన వివాదాలు తొలగిపోతాయి. ముఖ్యంగా వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు ఉంటాయి. కర్కాటక రాశి జాతకులు అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి రవి యోగం కారణంగా అదృష్టం పట్టబోతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.