
Garuda Purana : యమలోకంలో పిండాలను తింటూ జీవుడు ప్రయాణించే 16 మహా నగరాలు...!
Garuda Purana : ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు తాను చేసిన పాప పుణ్యాలను మూటగట్టుకొని ఏదో ఒక రోజున తప్పకుండా మరణిస్తాడు. అతను మరణించే సమయంలో వేల కొద్ది తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధతో ఆ జీవుడు మరణిస్తాడు. పాపాత్ములకు అదో మార్గాన ప్రాణాలు పోతాయి. జ్ఞానవంతులు, శీలవంతులు, ఉత్తమ గతిని పొందుతారు. అలా మరణించిన వెంటనే దిగంబరులు కాపూల నలనైన వారు కోపించిన కళ్ళు ఉన్నవారు గోళ్ళనే ఆయుధంగా కలిగి అతి భయంకరంగా ఉండే యమకింకరులు దండపాశధారులై రాగా వారిని చూసిన జీవునికి మూత్రపురిశాలు అప్రయత్నాంగానే విసర్జించబడతాయి. ఆ తరువాత బొటనవేలు ప్రమాణం కలిగిన రూపంలోకి మారిన జీవుడు స్థూల శరీరం విడిచి తన ఇల్లును చూస్తూనే పట్టుబడతాడు. తప్పు చేసిన వారిని రాజభటులు దండించినట్లు ఆ జీవుని యాతన శరీరానికి మెడలో పాసాలు వేసి తీసుకుపోతారు.. వెళ్లేదారిలో చీటికిమాటికి నరక వృత్తాంతాలు చెబుతూ నువ్విప్పుడు వెళ్ళేది నరకానికి అతి త్వరలోనే నిన్ను ఘోర నరకాలలో పడవేస్తామంటూ ఆ యమకింకరులు చెప్పే మాటలకు ఆ జీవుడు భయపడిపోతూ ఉంటాడు.
దానికి తోడు తన బంధువులు చేసే ఆక్రందన ధ్వనులు ఇంకా ఆ జీవునికి వినిపిస్తూనే ఉంటాయి. దారిలో ఆ జీవుడు యమ బటులకు వణుకుతూ తాను చేసిన పాపాలను తలుచుకుంటూ కుక్కల చేత కరవబడుతుంటాడు. అతనికి నడిచే శక్తి లేకున్నా కొరడాలతో యమ బటులు కొట్టడం చేత జీవుడు కాలిన ఇసకపరలోంచి ఎండ వేడిని వడగాలుల చేత బాధింపబడుతూ ఆకలి దప్పుల చేత బడలిక చెందుతూ ఏదోలా నడుస్తూ ఉంటారు. ఇక్కడ నుండి బయలుదేరిన రెండు ముహూర్తముల కాలమునకు యమలోకానికి చేరుకుంటాడు. అక్కడ కూడా జీవునికి నరక బాధలు చూపి చివరికి యముని దర్శింప చేస్తారు. ఆ యముని ఆజ్ఞ మేరకు ముహూర్త కాలంలోనే ఆకాశగమన మార్గంలో తిరిగి భూలోకానికి తీసుకువస్తారు. తిరిగి వచ్చిన ఏం ప్రయోజనం జీవన శరీరంలోకి తిరిగి ప్రవేశించడానికి ఎంత ప్రయత్నించినా యమ బటుల పాషాలకు గట్టిగా తగులుకొని ఉండడం వల్ల అతని శ్రమ అంతా నిష్ఫలమవుతుంది.
Garuda Purana : యమలోకంలో పిండాలను తింటూ జీవుడు ప్రయాణించే 16 మహా నగరాలు…!
ఆకలి దప్పులకు బాగా రోదిస్తాడు. ఆ సమయంలో పుత్రులచే ఇవ్వబడే పిండములే ఆహారము.. పుత్రుడు చేసే దానాలే నరకంలో ఉపశమనం అయినప్పటికీ కూడా నాస్తిక పాపాత్ములకు వీటి వల్ల తృప్తి కలగదు. పుత్రులు ఇచ్చే జలాంజలి శ్రాద్ధం దానాలు వీరికి చేరవు. ఇక పదమూడవ రోజున యమవతుల వెంట మార్గాన జీవుడు ప్రయాణం ప్రారంభిస్తాడు. ఇలా బయలుదేరిన జీవుడు వాయువేగంతో 17 రోజుల వరకు నడిచి 18వ రోజున సౌమ్యాపురం చేరుతారు. ఇక్కడ పుష్ప భద్ర అనే నది ప్రవహిస్తూ ఉంటుంది.అప్పుడు నేను ఎంతటి తప్పు చేశానో ఎంతో పుణ్యం చేస్తే గాని మానవజన్మ లభించదు. అలాంటి నాకు మానవ జన్మ లభించింది. అంత గొప్ప మానవ జన్మ లభించిన నేను ఎటువంటి ధర్మకార్యాలు చేయలేదు. పూజలు చేయలేదు..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.