Kitchen : సాధారణంగా ఇంట్లో పని చేస్తున్నప్పుడు కొన్ని వస్తువులు పదేపదే జారిపోతాయి. ఇలా జరిగినప్పుడు దానికి కారణం ఏమిటి అని ఎవరు పట్టించుకోరు. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది. ఇలా పదే పదే జరగడం వాస్తు శాస్త్రానికి సంబంధించినది కావచ్చు. అలాగే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు పదే పదే జారిపోవడం ఆశుభంగా పరిగణిస్తారు. ముఖ్యంగా వంటగదిలో ఉండే కొన్ని వస్తువులు కింద పడితే దానిని అశుభంగా పరిగణించబడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వంటగదిలో ఉప్పు మీ చేతి నుండి పదేపదే కింద పడితే అది అశుభంగా పరిగణించబడుతుంది. ఉప్పు చంద్రుడికి శుక్రుడికి సంబంధించినది కాబట్టి పదేపదే కింద పడితే మీ జీవితంలో ఏదో సంక్షోభం రాబోతుందని దీనికి అర్థం.
వంటగదిలో పాలు పదేపదే కిందపడిన లేదా చిందడం వంటివి జరిగితే అది అశుభంగా పరిగణించబడుతుంది. ఇలా జరిగితే ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది. ఇది ఇంటి సభ్యులకు మంచిది కాదు. పాలు నేల మీద పడితే జాతకంలో చంద్రుడు బలహీనమవుతాడని సంకేతం. చంద్రుడు బలహీనంగా ఉంటే జీవితంలో అనుకోని కష్టాలు ఎదురవుతాయి. ఇలా పదేపదే జరుగుతుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
వంట నూనె
ఇంట్లో లేదా వంట గదిలో నూనె పదే పదే పడితే అది శుభ పరిణామంగా పరిగణించబడదు. వంట నూనె శనీశ్వరుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఇలా పదేపదే జరగడం వలన జాతకంలో శనీశ్వరుడు బలహీనంగా మారుతున్నాడని అర్థం. అలాగే జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.
వంటగది ఏ దిశలో ఉండాలి
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి విషయాల్లో కొన్ని నియమాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అయితే చాలామంది వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటారు. ఇక దీని తర్వాత కూడా కొన్ని లోపాలు ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో వంటగది ప్రధానమైనది. వంటగది లేకుండా ఏ ఇల్లు కూడా ఉండదు. మరి అలాంటి వంటగది నిర్మాణంలో తలుపు దక్షిణం వైపు ఉండకూడదు. వంటగది తలుపు ఎల్లప్పుడు తూర్పు – దక్షిణ మధ్య దిశ లేదా ఈశాన్య దిశగా ఉండడం శుభంగా పరిగణించబడుతుంది. ఇలా ఉంటే ఇంట్లో ఆహార కొరత అనేది ఉండదు. అదేవిధంగా ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారు.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.