Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి సోమవారాలు కార్తీక పౌర్ణమి వంటి ముఖ్యమైన రోజులు ఉన్నాయి. అయితే కార్తీకమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్తన ఏకాదశి మరియు ప్రబోధిని ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం క్రోధినామా సంవత్సరంలో శ్రీమహావిష్ణు యోగా నిద్ర నుండి ఈరోజు మేల్కొంటాడు. ఈ ఏడాది కార్తీక మాసం శుక్ల ఏకాదశి తిధి నవంబర్ 12వ తేదీన ఉపవాసం చేయడానికి శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. ఇక ఈ రోజున శ్రీ మహా విష్ణువుని పూజించడం మరియు ఉపవాసం పాటించడం వలన సర్వపాపాలు నశిస్తాయి. అదేవిధంగా ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే వెయ్యి అశ్వయోధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు.
పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు యోగానిద్ర నుండి మేల్కొన్న రోజు నుండి శుభకార్యాలు మొదలవుతాయి. అయితే ఆర్థిక శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుని నిద్ర నుండి లేపేందుకు విష్ణు లోకానికి బ్రహ్మాది దేవతలతో పాటుగా మహర్షి కూడా వెళ్తారు. ఇక ఆ రోజున అందరూ కలిసి భజనలు చేసుకుంటూ నాట్యం చేస్తూ కీర్తనలు మృదంగం వాయిద్యాలతో స్వామిని మేల్కొలుపుతారు. అనంతరం పరమేశ్వరుడు విష్ణుమూర్తిని ఆర్జించి హారతి ఇస్తుండగా బ్రహ్మ వేదాలను పటించారు . ఇక ఆ రోజు నుండి పూజ కార్యక్రమాలలో హారతి ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఉత్తన ఏకాదశి రోజున ఉపవాసాన్ని ఆచరించడం వలన జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. అలా మరుసటి రోజు ద్వాదశి రోజున ఆలయాలలో ఇళ్లల్లో తులసి వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున చేసే దానధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఉత్తన ఏకాదశి రోజున దానధర్మాలు పుణ్యకార్యాలు చేసేవారి ఇంత ధనధాన్యాలుకి లోటు ఉండదని మరియు జీవితంలో సుఖసంతోషాలతో పాటు ఐశ్వర్యానికి లోటు ఉండదని పురోహితులు చెబుతున్నారు.
కార్తీక ఏకాదశి రోజున ఉపవాసాన్ని పాటించి శ్రీ మహా విష్ణుమూర్తిని ఆరాధించడం వలన కోరికలన్నీ నెరవేరుతాయిని చాలామంది భక్తులు నమ్ముతారు. పురాణాలలో మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు ఏకాదశి రోజున వస్త్రాలను వదిలి అంపశయ్యపై శయనించాడు. అటువంటి పవిత్రమైన రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత ఇంటిని శుభ్రపరచుకున్న అనంతరం శ్రీ విష్ణు సమర్పించుకుంటూ శ్రీహరి విగ్రహం లేదా ఫోటో ముందు శంఖం గంటలు ఊపుతూ శ్రీ మహా విష్ణువు ఎదుట ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. మర్నాడు ద్వాదశి రోజున పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఉపవాసాన్ని విరమించాలి.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.