Home » News » USA Target : అసలెందుకు ఈ యుద్ధం , అమెరికా నిజమైన TARGET ఏంటి ?
News

USA Target : అసలెందుకు ఈ యుద్ధం , అమెరికా నిజమైన TARGET ఏంటి ?

Siddhu Manchikanti
Authored By
Siddhu Manchikanti
The Telugu News | Updated on: March 4, 2026 10:59 am

USA Target : అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న గొడవలు చూస్తుంటే అసలు వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇరాన్ అణువాయుధాలు తయారు చేస్తోందని, అది ప్రపంచానికి ముప్పు అని అమెరికా పైకి చెబుతున్న మాట. కానీ లోతుగా ఆలోచిస్తే అణువాయుధాల నియంత్రణ అనేది కేవలం ఒక సాకు మాత్రమే అనిపిస్తుంది. ఎందుకంటే ఒమన్ వంటి దేశాల మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చల్లో అమెరికా పెట్టిన నిబంధనలన్నిటికీ ఇరాన్ అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి. 24 గంటల్లో ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నా కూడా అమెరికా యుద్ధానికే మొగ్గు చూపడం చూస్తుంటే అక్కడ ఏదో వేరే ప్లాన్ ఉందని అర్థం అవుతోంది. నిజానికి 2015 లోనే ఒబామా హయాంలో ఒక ఒప్పందం కుదిరింది. అప్పట్లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణకు ఇరాన్ ఒప్పుకుంది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఆ ఒప్పందం నుండి అమెరికానే బయటకు వచ్చేసింది. అంటే అన్వాయుధాలు ఆపడం కంటే ఇరాన్ లో ఉన్న ప్రభుత్వాన్ని మార్చడమే అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement

USA Target : అసలెందుకు ఈ యుద్ధం , అమెరికా నిజమైన TARGET ఏంటి ?e

అమెరికా ఇరాన్ వ్యవహారాలు

1979 కి ముందు ఇరాన్ లో అమెరికాకు అనుకూలమైన పాలన ఉండేది. ఆ తర్వాత వచ్చిన ఇస్లామిక్ విప్లవం వల్ల అమెరికా మాట వినని నాయకులు అధికారంలోకి వచ్చారు. గత నలభై ఏళ్లకు పైగా ఇరాన్ అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ తో సంబంధాలు పెంచుకోవాలని అమెరికా ఒత్తిడి చేసినా ఇరాన్ లొంగలేదు. అందుకే అక్కడ ఉన్న వ్యవస్థను పూర్తిగా కూల్చేయాలని అమెరికా చూస్తోంది. అయితే గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగిన చోట ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలి. ఇరాక్ లో సద్దాం హుస్సేన్ ను అంతం చేశారు కానీ అక్కడ ఏం జరిగింది. కొత్తగా ఐసిస్ లాంటి భయంకరమైన ఉగ్రవాద సంస్థ పుట్టింది. లిబియాలో గడాఫీని దించేశారు కానీ ఆ దేశం ఇవాళ అంతర్యుద్ధంతో ముక్కలైపోయింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఇరవై ఏళ్ల పాటు యుద్ధం చేసి చివరికి ఏమీ చేయలేక మళ్ళీ తాలిబాన్లకే అధికారాన్ని అప్పగించి అమెరికా వెనక్కి వెళ్ళిపోయింది.

Advertisement

ప్రజాస్వామ్యం అనేది ఒక దేశం నుండి ఇంకో దేశానికి పార్శిల్ పంపినట్టు పంపలేము. ఒక దేశంలోని వ్యవస్థను బలవంతంగా మార్చాలని చూస్తే అక్కడ అరాచకం పుడుతుంది తప్ప శాంతి రాదు. అమెరికా జోక్యం చేసుకున్న ప్రతి చోటా అస్థిరత పెరిగింది. ఇప్పుడు ఇరాన్ లో కూడా అదే జరిగితే మరో కొత్త రకమైన ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని అమెరికా చెబుతుంది కానీ చరిత్ర చూస్తే అల్ ఖైదా పుట్టడానికి అమెరికా విధానాలే కారణం అయ్యాయి. పాకిస్తాన్ లేదా సౌదీ అరేబియా లాంటి దేశాల సహకారంతో అమెరికా చేసిన ఆపరేషన్ల నుండే ఒసామా బిన్ లాడెన్ లాంటి వాళ్ళు తయారయ్యారు. ఇరాక్ మరియు సిరియాలో అమెరికా చేసిన యుద్ధాల వల్లే ఐసిస్ పుట్టింది. ఇవాళ బంగ్లాదేశ్ లో గానీ పాకిస్తాన్ లో గానీ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అమెరికా అండ ఉన్న చోటే తీవ్రవాద శక్తులు పెరుగుతున్నాయని అర్థం అవుతోంది.

ఇరాన్ మీద పదే పదే దాడులు చేయడం వల్ల ఆ ప్రాంతం మొత్తం రావణకాష్టంలా మండుతుంది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. అమెరికా తన స్వార్థ ప్రయోజనాల కోసం పాత పద్ధతుల్నే అనుసరిస్తూ దేశాలను అస్థిరపరుస్తోంది. ఒకవేళ ఇరాన్ లో ప్రభుత్వం పడిపోయినా అక్కడ మంచి ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుందన్న గ్యారెంటీ లేదు. బహుశా కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ పరిస్థితులు చేయి దాటిపోయాయని గ్రహించి అమెరికా పాలకులు వెనక్కి తగ్గొచ్చు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో లేదా అది పుట్టడానికి కారణమయ్యే పరిస్థితులు కల్పించడంలో అమెరికా విదేశీ విధానం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇరాన్ విషయంలో కూడా చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉన్నా యుద్ధానికే సిద్ధమవ్వడం అనేది ప్రపంచ శాంతికి ఏమాత్రం మంచిది కాదు. కేవలం అధికారం కోసం వ్యవస్థల్ని మార్చాలనుకోవడం వల్ల సామాన్య ప్రజలు బలైపోతున్నారు. అమెరికా తన పద్ధతి మార్చుకోకపోతే ఇరాన్ కూడా మరో ఆఫ్ఘనిస్తాన్ లా మారే ప్రమాదం ఉంది.

Advertisement

Siddhu Manchikanti

Author Bio Info : Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15+ years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Latest Posts

Related Posts

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి