Diwali Wishes : దీపావళి సందర్భంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందువులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ (X) వేదికగా ఆయన స్పందిస్తూ.. “పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందువులకు నా హృదయపూర్వక ‘దీపావళి’ శుభాకాంక్షలు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లోని హిందువులకు, మీరు ఉన్న పరిస్థితిలో శ్రీరాముడు మీకు శక్తిని మరియు ధైర్యాన్ని ఇస్తాడు. ‘భారత్’లో మేమంతా మీ భద్రత కోసం ఎదురు చూస్తున్నాము. మీరు మా ప్రార్థనలలో ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు.
పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌లలో వారి “భద్రత మరియు ప్రాథమిక హక్కుల” కోసం ప్రపంచ సమాజం మరియు ప్రపంచ నాయకులు పాటుపడాలని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. “ఈ రోజు దీపావళి రోజున, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ రెండు దేశాల్లోనూ హింసకు గురవుతున్న హిందువుల భద్రత కోసం అందరం ప్రార్థిద్దాం. వారి భూముల్లో ధర్మం పునరుద్ధరించబడాలి అన్నారు.
ఓ హిందూ చిన్నారి పాటపై పవన్ కళ్యాణ్ స్పందించారు. “పాకిస్తాన్‌కు చెందిన ఒక హిందూ బిడ్డ రాసిన ఈ పాట విభజన యొక్క లోతైన బాధను ప్రతిబింబిస్తుందన్నారు. భారతదేశం యొక్క ఆత్మతో తిరిగి కనెక్ట్ కావాలనే కోరిక వెల్లడించిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వారి జీవితాల్లో ఆనందం మరియు శ్రేయస్సు నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
Flowers : సూర్య కిరణాలు మొగ్గల మీద పడినప్పుడే అవి వికసిస్తాయని తెలిసిందే. మొగ్గ పువ్వుగా మారాలంటే సూర్య కాంతి…
Ys Sharmila : ఆస్తి పంపకాల వ్యవహారంలో సొంత తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రతి…
Revanth Reddy : బీసీ కులాల గణనను నిర్వహించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానమని పునరుద్ఘాటించిన…
TTD Chairman : తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. ఈ నిర్ణయం ప్రపంచంలోని అతిపెద్ద…
AP Govt Good News : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శుభవార్తల మీద శుభవార్తల మీద…
Ginger Hair Fall : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే సమస్యలలో జుట్టు రాలే సమస్య కూడా…
Samantha : అక్కినేని మాజీ కోడలు సమంత సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఆమె వెండితెర మీద…
Giloy Leaves : మన పరిసర ప్రాంతంలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వాటిని మనం పిచ్చి మొక్కలు…
This website uses cookies.