Home » Devotional » Pongal Speciality
Devotional

Pongal : సంక్రాంతి పండు రోజు ఏ రంగు దుస్తులు ద‌రించాలి… ఏ దానాలు చేయాలో మీకు తెలుసా..?

Authored By
Sam C
The Telugu News | Published on: January 14, 2022, 6:00 am
Advertisement

Pongal : తెలుగు ప్ర‌జ‌ల‌కే ద‌క్షిణాది ప్ర‌జ‌లంద‌రు సంతోషంగా జ‌రుపుకునే పండుగ‌ల‌లో సంక్రాంతి ఒక‌టి. ఈ పండుగ‌కు కుటుంబ స‌భ్యులు అంతా ఒక చోట చేరి సంతోషంగా ఈ పండుగ‌ను జ‌రుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ.. మొదటి రోజు భోగి , రెండో రోజు సంక్రాంతి , మూడో రోజు కనుమ .. ఇలా మూడు రోజు పాటు సందడి కనిపిస్తోంది.. ఒక్కో రోజుకూ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణం.. రైతన్నలే.. ఆరుగాలం శ్రమించిన పంట తమ చేతికి వచ్చాయనే ఆనందంతో రైతులు ఉంటారు.సంక్రాంతి పండుగ రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచి శుభ ఫలితం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Advertisement

ఇంటిని శుభ్రపరచుకుని, గడపకు పసుపు, కుంకుమలు పెట్టి, గుమ్మానికి తోరణాలు కట్టి, పూలతో అలంకరిస్తారు. ఈ రోజున హరిదాసు హరినామ కీర్తనలు, బుడబుక్కల దొరలు, గంగిరెద్దుల వాళ్లు ప్ర‌తి ఇంటి ద‌గ్గ‌ర సంద‌డి చేస్తుంటారు.ఈ రోజున పితృదేవతారాధన చేయడంతో వారి శుభాశీస్సులతో వర్ధిల్లుతారని పురోహితులు చెబుతున్నారు.సంక్రాంతి రోజున గుమ్మడి పండ్లను దానం చేస్తే శ్రీ మహా విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజున పిండిపదార్థాలుగా చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను నైవేద్యంగా సూర్యభగవానుడికి, పితృదేవతలకు పెట్టి ప్రార్థించుకుంటే మోక్షమార్గము, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతారు. మూడు రోజులకు మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. భోగీ రోజున తెల్లవారు జామునే భోగిమంటలను వేస్తారు.

pongal speciality

Advertisement

Pongal : సంక్రాంతి అంటే రైతుల పండుగ‌

ఇంట్లో చిన్న పిలల్లు ఉంటె.. ఆ రోజు భోగి పళ్ళు కూడా పోస్తారు. రెండో రోజు సంక్రాంతి లేదా పెద్దల పండగ.. ఈరోజు తమ పుర్వికులను స్మరించుకుంటారు. కొంతమంది బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేస్తారు. మూడవ రోజున శివునికి ఇష్టమైన నందిని పూజించడం ఆచారం. అందుకనే ఈ రోజు ఎద్దులను పూజిస్తారు. నాల్గవ రోజు అంటే చివరి రోజు ముక్కనుమ రోజున అమ్మవారిని పూజించి నైవేద్యం పెడతారు.సంక్రాంతి పండుగ రోజున ఎవరితోనూ వాదనకు దిగరాదు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో, కొత్త అల్లుళ్ళతో, కోడిపందాలతో ఆనందంగా సరదాగా జరుపుకునే పండుగ ఇది. దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా , ఆంధ్రప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో సంక్రాంతి అని పిలుస్తారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి