Zodiac Signs : శుక్ర గ్రహ ప్రవేశంతో జూన్ నుండి ఈ రాశులవారు అదృష్టవంతులే
Zodiac Signs : జ్యోతిష శాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ప్రముఖమైన స్థానం ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని విలాసాలకు అధిపతిగా చెబుతారు. శుక్రుడిని జాతకంలో శ్రేయస్సు, సంపద, ఆనందం, కళలు వంటి వాటికి ప్రతీకగా చెబుతారు. అటువంటి శుక్రుడు సంవత్సరం తర్వాత మేష రాశిని వదిలి వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.
Zodiac Signs : శుక్ర గ్రహ ప్రవేశంతో జూన్ నుండి ఈ రాశులవారు అదృష్టవంతులే
శుక్రుడు జూన్ 29న మధ్యాహ్నం 2.17 గంటలకు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. వృషభ రాశిలోకి శుక్రుడి సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకు వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందామా?
వృషభ రాశిలోకి శుక్ర సంచారం ఆ జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. శుక్ర సంచారం వల్ల వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వర్తక వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషకంగా ఉంటుంది. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం.
మిధున రాశిలో శుక్ర సంచారం వీరికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇది శుభ సమయం. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో పెట్టుబడి పెడితే బాగా డబ్బులు వచ్చే అవకాశం.
శుక్ర సంచారం కారణంగా తులా రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. వృషభ రాశిలో శుక్ర సంచారం తులా రాశి వారికి కలిసి వస్తుంది. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. పెండ్లికాని వారికి పెళ్లయ్యే అవకాశం. పూర్వీకుల ఆస్తులు వచ్చే అవకాశం.
మకర రాశి జాతకులకు శుక్ర సంచారం కారణంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మకర రాశి వారు సంతోషంగా జీవిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా ఇది లాభదాయకమైన సమయం.
శుక్ర సంచారం కారణంగా మీనరాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. శుక్ర సంచారం మీన రాశి వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లే వారికి కలిసి వస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది.
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.