
what will happen from 2023 to 2060 as per Brahmam Gari Kalagnanam
Brahmam Gari Kalagnanam : బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు చాలా విషయాలు జరిగాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చాలా విషయాలు రాశారు. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ఈయన ముందుగానే రచించి తాలపత్ర గ్రంథాల్లో రచించి పొందుపరిచారు. ఆయన ఇప్పుడు కాదు.. కొన్ని వేల సంవత్సరాల కిందనే తాళపత్ర గ్రంథాల్లో రాశారు. అవన్నీ జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. బ్రహ్మంగారు చెప్పినవి ఎన్నో నిజం అవడం వల్ల.. కాలజ్ఞానాన్ని అందరూ నమ్మాల్సి వస్తోంది. ఆయన కాలజ్ఞానం ప్రకారం నీటితో దీపాలు వెలిగిస్తారు అన్నారు.
అంటే నీటితో కరెంట్ ను ఉత్పత్తి చేయడం అన్నమాట. ఎద్దులు లేకుండానే బండ్లు నడుస్తాయి అని చెప్పారు. ఇప్పుడు అన్నీ యంత్ర వాహనాలే వచ్చాయి. కాశిపట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది అని చెప్పారు. ఒక వితంతువు 16 ఏళ్ల పాటు ఈ దేశాన్ని ఏలుతుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. తెర మీది బొమ్మలు గద్దెనెక్కుతాయి అన్నారు. రాచరికాలు నశిస్తాయి.. రాజుల పాలన నశిస్తుంది అన్నారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, హైదరాబాద్ లో హిందూ ముస్లింలు ఒకరిని మరొకరు నరుక్కొని చనిపోతారని, మతకలహాలు చెలరేగుతాయని, దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనం అవుతాయని, దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయని చెప్పారు.
what will happen from 2023 to 2060 as per Brahmam Gari Kalagnanam
చిత్రవిచిత్రమైన యంత్రాలు పుట్టుకొస్తాయని, ఎన్ని యంత్రాలు పుట్టుకొచ్చినా చావుకు, పుట్టుకకు మాత్రం ఎటువంటి యంత్రాన్ని, సూత్రాన్ని కనిపెట్టలేరని చెప్పారు. సృష్టిని మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలం అవుతాయి. గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడని చెప్పారు. కపట యోగులు విపరీతంగా పెరుగుతారని, ప్రజలు మోసపోతారని చెప్పారు. అడవి మృగాలు గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించి మనుషులను చంపుతాయన్నారు. కరోనా వ్యాధి గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కోరంకి అను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి చచ్చేరయ్యా అంటూ కాలజ్ఞానంలో ఈ వ్యాధి గురించి ప్రస్తావించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు
రాష్ట్రాన్ని పాలిస్తారు అనే అంశాన్ని కాలజ్ఞానంలో పొందుపరిచారు. 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారట. తెలుగు రాష్ట్రాన పవనుడు వచ్చెనయ్యా.. రాజ వారసత్వం నశించెనయ్యా అని తన కాలజ్ఞానంలో రాశారు. కర్నూలు జిల్లాలోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్లు మింగుతాడని బ్రహ్మంగారు చెప్పారు. 2028 నాటికి ప్రపంచంలోనే అగ్రదేశంగా భారత్ నిలుస్తుందని చెప్పారు. 2034 లోపు ప్రపంచ వినాశనం తప్పదని కాలజ్ఞానంలో చెప్పారు. యుద్ధాలు, భూకంపాలు వచ్చి ఈ ప్రపంచం వినాశనం అవుతుందని అన్నారు. కొత్త కొత్త వైరస్ లు వచ్చి క్షణాల్లోనే మనుషులు మరణిస్తారని భూమి మీద మనుగడ దినదిన గండంగా ఉంటుందని చెప్పారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.